Breaking News

నేటి నుంచి ర్యాపిడ్‌ రైలు సేవల్లో మరో ముందడుగు

Published on Sun, 08/18/2024 - 07:42

దేశంలో నేటి నుంచి ర్యాపిడ్‌ రైలు మరింత దూరం పరుగులు తీయనుంది. ఇది ఆధునిక రైల్వే యుగంలో మరో ముందడుగు కానుంది. మీరట్ సౌత్ ఆర్‌ఆర్‌టీఎస్‌ స్టేషన్‌ నుంచి ర్యాపిడ్‌ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయిని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సీఆర్‌టీసీ) తెలిపింది. దీంతో ఢిల్లీలోని ప్రయాణికులు ఎన్‌సీఆర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ వరకు రాకపోకలు సాగించగలుగుతారు.

82 కిలోమీటర్ల రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్)లో 42 కి.మీల వినియోగం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఎన్‌సీఆర్‌టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు (ఆదివారం) మీరట్ మొదటి స్టేషన్ మధ్యాహ్నం రెండు గంటలకు తెరుచుకోనుంది. ఇప్పటి వరకు నమో భారత్ రైలు సర్వీసులు ఘజియాబాద్ నుంచి మోదీనగర్ నార్త్ వరకు మాత్రమే నడిచేవి. ఇప్పుడు మీరట్ నగరంలో సర్వీసు ప్రారంభం కావడంతో ఘజియాబాద్, ఢిల్లీ వైపు వెళ్లే వారి ప్రయాణం మరింత సులభతరం కానుంది.

ఆర్‌ఆర్‌టీఎస్‌ 2023, అక్టోబర్‌లో ఘజియాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఘజియాబాద్‌లోని సాహిబాబాద్- దుహై డిపోల మధ్య 17 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పటి వరకు  ఈ మార్గంలో 22 లక్షల మంది ప్రయాణించారు. ఢిల్లీ - మీరట్ మధ్యనున్న కారిడార్‌లో మొత్తం 25 స్టేషన్లున్నాయి. జూన్ 2025 నాటికి ఢిల్లీ- మీరట్ మధ్య మొత్తం విస్తరణను పూర్తి చేయాలని ఎన్‌సీఆర్‌టీసీ భావిస్తోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)