Breaking News

రూర్కీలో రైలు పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌

Published on Mon, 10/14/2024 - 04:43

హరిద్వార్‌: ఉత్తరాఖండ్‌లోని రూర్కీ–లుక్సార్‌ మార్గంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్‌ సిలిండర్‌ను ఉంచారు. ధంధేరా రైల్వే స్టేషన్‌ సమీపంలో రెండో లైన్‌పై ఉన్న సిలిండర్‌ను శనివారం ఉదయం 6.45 గంటల సమయంలో గూడ్స్‌ రైలు గార్డు ఒకరు గమనించి అధికారులకు వెంటనే సమాచారిమిచ్చారు. 

ఆ సమయంలో ఆ మార్గంలో రైళ్లేవీ ప్రయాణించడం లేదని లుక్సర్‌ రైల్వే పోలీస్‌ ఇన్‌చార్జి సంజయ్‌ శర్మ చెప్పారు. రైలు మార్గం మధ్యలో మూడు కిలోల చిన్న ఖాళీ సిలిండర్‌ పడి ఉందని తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు బృందాలు సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూర్కీ సివిల్‌ లైన్‌ పోలీస్‌స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.

ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీకి మంటలు
ఛతర్‌పూర్‌: మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో ఆదివారం ఉదయం గీతా జయంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీకి మంటలంటుకున్నాయి. ఉదయం 7.30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఇషానగర్‌ స్టేషన్‌ నుంచి రైలు వెళ్తుండగా డీ5 కోచ్‌లో పొగలు రావడాన్ని గమనించిన వెంటనే సిబ్బంది రైలును నిలిపివేసి, ఆర్పివేశారని ఓ అధికారి తెలిపారు. కోచ్‌ దిగువ భాగంలోని రబ్బర్‌ వేడెక్కడం వల్లే మంటలు మొదలైనట్లు తెలుస్తోందన్నారు. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)