Breaking News

గ్యాంగ్‌స్ట్‌ర్‌ అతిక్‌ అహ్మద్‌ ఆస్తి యూపీ ప్రభుత్వానికి బదిలీ

Published on Wed, 07/17/2024 - 20:09

లక్నో: గ్యాంగ్‌స్ట్‌ర్‌, పొలిటికల్‌ లీడర్‌ అతిక్‌ అహ్మద్‌ గతేడాది హత్యకు గురయ్యారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అతిక్‌ సంబంధించి ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న రూ. 50 కోట్ల విలువైన  ఆస్తిని స్వాధీనం చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌ కోర్టు అతిక్‌ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించినట్లు ప్రయాగ్‌రాజ్‌ జిల్లా  ప్రభుత్వ న్యాయవాది( క్రిమినల్‌) గులాబ్‌ చంద్రఅగ్రహారి తెలిపారు.

2.377 హెక్టార్ల భూమిని అతిక్‌ నేరకార్యకలాపాల ద్వారా సంపాధించినట్లు తెలిపారు. అయితే ఈ భూమి హుబాలాల్‌ అనే వ్యక్తి పేరు మీద ఉందని చెప్పారు. ఈ భూమిని పోలీసులు 2023 నవంబర్‌లో సీజ్‌ చేశారు. గ్యాంగ్‌స్టర్‌ చట్టంలోని సెక్షన్‌ 14(1)కింద పోలీసులు  ఈ భూమిని సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ భూమికి సంబంధించి యజమాని ఎవరనేదానిపై ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు. 

దీంతో పోలీసు కమిషనర్‌ కోర్టు ఈ కేసు ప్రయాగ్‌రాజ్‌ కోర్టుకు బదిలీ చేసింది. దీంతో బుధవారం జడ్జి వినోద్‌ చౌరాసియా పోలీసు కమిషనర్‌ కోర్టు తీర్పును సమర్థిస్తూ.. అతిక్‌ ఆస్తులను ఉత్తరపదేశ్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకోలని ఆదేశించారు.

అతిక్‌, అతని సోదరుడు అష్రాఫ్ సుమారు వందకుపైగా క్రిమినల్‌ కేసులు ఉ‍న్నాయి. అదీకాక ఉమేష్‌ పాల్‌ హత్యకేసుతో ఆరోపణలు కూడా ఉన్నాయి.  ఈ  నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌ అతిక్‌, అతని సోదరుడు అష్రాఫ్‌ హత్యకు గురయ్యారు. జర్నలిస్టులుగా నటిస్తూ దుండగులు అత్యంత సమీపంగా జరిపిన కాల్పుల్లో మృతిచెందారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)