శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం
Breaking News
తగ్గేదేలే.. బన్నీ, ఎన్టీఆర్, చరణ్, యశ్ గెటప్‌లలో గణేషుడు
Published on Wed, 08/31/2022 - 11:58
దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ శోభ కనిపిస్తోంది. నవరాత్రోత్సవాలు జరిపేందుకు ప్రతివీధిలోనూ మండపాలు ముస్తాబయ్యాయి. వినాయక చవితి సంబరాలతో నగరాలన్నీ సందడిగా మారాయి.. ఏ గల్లీలో అడుగు పెట్టినా గణనాథుని రూపాలే దర్శనమిస్తున్నాయి. ప్రతిచోటా రకరకాల రూపాల్లో వినాయక ప్రతిమలు మండపాల్లో కొలువుదీరాయి. అయితే కొన్ని ప్రదేశాల్లో డిఫరెంట్ గణేష్ రూపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
వినాయక విగ్రహాల మీద సినిమాల ప్రభావం కూడా చాలానే ఉంది. గత కొన్నేళ్లుగా సినిమాలోని హీరోలు, వారు పోషించిన పాత్రల రూపంలో వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా కొందరి హీరోల రూపంలో ప్రతిష్టించారు. తాజాగా ఓచోట పుష్పలో అల్లు అర్జున్ తగ్గేదేలే అన్నట్లు విగ్రహాన్ని రూపొందించారు.
మరోచోట ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ సినిమా క్లైమాక్స్‌లో పరుగెడుతూ ఉన్నటువంటి, బాణాన్ని ఎక్కుపెడుతున్న గెటప్‌లో ఉన్నాడు గణేషుడు.. అలాగే ఎన్టీఆర్ భీం రూపంలో..కేజీఎఫ్‌లో యశ్ రూపంలో విఘ్నేశుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.
ఇక బన్నీ, ఎన్టీఆర్, చరణ్, యశ్ ఫ్యాన్స్ వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక సాధారణ జనాలు సైతం ఆ విగ్రహాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ వెరైటీ వినాయకుడి విగ్రహాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
PushparAAj...Thaggedhe Le 🔥
— Trinadh❤️AADHF🪓 (@TrinadhAADHF) August 30, 2022
Allu Arjun Film roles & Ganesh Idols
Never Ending Festival VIBE!! 🔥🔥🤩
This time In Pushpa Raj Avatar 🌟🔥#GaneshChaturthi #PushpaTheRule #AlluArjun pic.twitter.com/YuCYEAziMV
Tags : 1