Breaking News

‘మంత్రి అతిషి జెండా ఎగరవేయలేరు’

Published on Tue, 08/13/2024 - 14:44

ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితి  నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో తిహార్ జైలులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తరఫున మంత్రి అతిశీ  జాతీయ జెండాను ఎగరవేయడానికి అనుమతి లేదని తెలిపింది. ఇక.. సోమవారం సాధారణ పరిపాలన శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌  కేజ్రీవాల్‌ కోరిక మేరకు రాష్ట్ర మంత్రి అతిశీ జెండా ఎగరవేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 

అయితే తాజాగా జీఏడీ అదనపు ముఖ్యకార్యదర్శి నవీన్‌ కుమార్‌ చౌదరీ స్పందిస్తూ.. జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌ ఆదేశాలు చట్టపరంగా చెల్లుబాటు కాదని అన్నారు. ఆ ఆదేశాలము తాము పాటించలేమని స్పష్టం చేశారు. ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సీఎం కేజ్రీవాల్‌ లేఖ రాశారు. జైలు నిబంధనల ప్రకారం ఇలా చేయటం అనుతించబడదని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఛత్రసల్ స్టేడియం వేదికగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంతో జెండా ఎగరవేసే విషయంపై అత్యున్నత అధికారులకు తెలియజేశామని తెలిపారు. వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.

Videos

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)