Breaking News

కేంద్ర పథకాల పేర్లు మారిస్తే నిధులు కట్‌!

Published on Sat, 02/25/2023 - 08:14

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ కొన్ని రాష్ట్రాలు తమకు లబ్ధి కలిగేలా కొత్త పేర్లు పెట్టడం ఇకపై కుదరదు. పార్లమెంట్‌ ఆమోదం పొందిన పథకాల పేర్లను మార్చడం అంటే కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, పాత్రను ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేయడమే అవుతుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, పథకాల పేర్లను మార్చే రాష్ట్రాలకు నిధులు నిలిపివేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై), పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన (పీఎంజీకేఏవై), ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలకు వివిధ రాష్ట్రాలు తమకు అనుకూల పేర్లను పెట్టి అమలు చేస్తున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లను పంజాబ్‌ ప్రభుత్వం ‘ఆమ్‌ ఆద్మీ క్లినిక్‌’లుగా మార్చింది. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం పీఎంఏవై పథకాన్ని బంగ్లా ఆవాస్‌ యోజనగా మార్చి ఆ రాష్ట్ర సీఎం ఫోటోతో ప్రచారం చేసుకుంటోంది. ఢిల్లీలో దీనిని న్యూఢిల్లీ ఆవాస్‌ యోజన అని పిలుస్తున్నారు. అలాగే తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్‌ల్లోనూ ఈ పథకం పేరు మార్చారంటూ పార్లమెంట్‌ సమావేశాల్లో కొందరు ఎంపీలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.  

నిబంధనలు పాటిస్తేనే నిధులు.. 
ఈ క్రమంలో కేంద్ర పథకాల పేర్లను మార్చకుండా నిబంధనల మేరకు అమలు చేస్తున్న రాష్ట్రాలకే నిధులు పొందే అర్హత ఉంటుందన్న షరతును కచి్చతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నట్లు సమాచారం. ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్‌ భారత్‌కు కేంద్రం పెట్టిన పేరు మార్చాయి. ఇది నిబంధనల ఉల్లంఘనే. ఈ పద్ధతి నిధుల విడుదల నిలిపివేయడానికి దారి తీస్తుంది’అని హెచ్చరించడం గమనార్హం.
చదవండి: మోయలేని రుణ భారంతో... దేశాలే తలకిందులు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)