Breaking News

దేశవ్యాప్తంగా FSSAI దాడులు.. రూ.81 కోట్ల విలువైన ఆహార పదార్థాలు సీజ్

Published on Sun, 11/08/2026 - 15:04

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆహార కల్తీ, నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) భారీ తనిఖీలు చేపట్టింది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం రూ.81.80 కోట్ల విలువైన 3,270 మెట్రిక్ టన్నులకు పైగా ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. అంతేకాదు FSSAI నిబంధనలు ఉల్లంఘించిన 1,133 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేయగా, మరో 52 లైసెన్సులను రద్దు చేసింది.

ఈ రెండు నెలల తనిఖీల్లో దేశవ్యాప్తంగా 56,431 ఆహార విక్రయ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. అందులో 10,047 నిబంధనల ఉల్లంఘనలపై సరిదిద్దుకోవడానికి నోటీసులు జారీ చేశారు. మొత్తం 43,939 ఆహార నమూనాలను సేకరించగా, ఇప్పటివరకు 23,648 నమూనాలను పరీక్షించారు. వీటిలో 2,273 నమూనాలు ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు.

నాణ్యత లేని నూనె, పాలు, పనీర్, స్వీట్లు, నెయ్యి, బేకరీ ఉత్పత్తులు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, నమ్కీన్ తదితర ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 314 సంస్థలను సీజ్ చేయడంతో పాటు 410 కేసుల్లో ప్రాసిక్యూషన్ ప్రారంభించారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రతా విభాగాల సహకారంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. పండుగల సమయంలో కల్తీ, నకిలీ, ప్రమాదకర ఆహార పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: ప్రాణం తీసిన పార్కింగ్ వివాదం

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)