Breaking News

దిగొచ్చిన కుకీ గ్రూపులు 

Published on Fri, 09/05/2025 - 06:47

న్యూఢిల్లీ: మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటనకు ముందు కీలకమైన సానుకూల పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని రెండు ప్రధానమైన సాయుధ గ్రూపులతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం ఢిల్లీలో మణిపూర్‌ ప్రభుత్వం, కుకీ నేషనల్‌ ఆర్గనైజేషన్‌(కేఎన్‌వో), యునైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌(యూపీఎఫ్‌)లతో కేంద్ర హోం శాఖ కార్యకలాపాల నిలిపివేత (సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌)కు సంబంధించిన త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.

 గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న చర్చలు గురువారం మూడు పక్షాలు ఒప్పందంపై సంతకాలు చేయడంతో ముగిశాయని హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాదిపాటు అమల్లో ఉండే ఒప్పందంతో మణిపూర్‌ ప్రాదేశిక సమగ్రతకు ఎటువంటి భంగం కలగదని స్పష్టం చేసింది. ఏడు వర్గాలు కలిగిన యూపీఎఫ్, 13 వర్గాలున్న కేఎన్‌వోలు తమ కార్యకలాపాలను నిలిపివేస్తాయని తెలిపింది. చర్చలతో సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ముందుకు వచ్చాయని పేర్కొంది. 

ఒప్పందం ప్రకారం రెండు సాయుధ గ్రూపులు సంక్షోభ ప్రాంతాల్లోని ఏడు క్యాంపులను వేరే చోటుకు మార్చడంతోపాటు మొత్తమ్మీద క్యాంపుల సంఖ్యను తగ్గించేందుకు అంగీకరించాయి. తమ వద్ద ఉన్న ఆయుధాలను బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుల్లో అప్పగించడం, ఈ గ్రూపుల్లో ఎవరైనా విదేశీయులుంటే గుర్తించేందుకు భద్రతా బలగాలకు సహకారం అందించడం కూడా ఉన్నాయి. 

ఒప్పందం అమలు, ఉల్లంఘనలను గుర్తించేందుకు ఉమ్మడి పర్యవేక్షణ బృందం ఏర్పాటైంది. ఈ బృందమే ఒప్పందాన్ని సమీక్షిస్తుందని హోం శాఖ తెలిపింది. మరో వైపు అత్యవసర వస్తువుల సరఫరాకు వీలుగా, వాహనాల రాకపోకలకు మణిపూర్‌ మీదుగా వెళ్లే రెండో నంబర్‌ జాతీయ రహదారిని తెరవాలని కుకీ–జో కౌన్సిల్‌(కేజెడ్‌సీ) నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో భద్రతా బలగాలతో సహకరించేందుకు కేజెడ్‌సీ అంగీకరించిందని హోం శాఖ పేర్కొంది. 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)