Breaking News

పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం?

Published on Tue, 07/08/2025 - 13:31

సాక్షి,కర్ణాటక: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఐదు గ్యారెంటీలను ప్రకటించడంతో జనం కాంగ్రెస్‌ పార్టీకి బ్రహ్మరథం పట్టి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సిద్దరామయ్య శక్తియోజన కింద మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. మూడేళ్లుగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పురుషులు తాము కూడా ఓటు వేశామని, తామేం పాపం చేశామని చర్చించుకుంటున్న తరుణంలో ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా నడుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం  కల్పించి, పురుషులపై అధిక టికెట్‌ ధరలను విధించినట్లు కూడా విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది.  

అభివృద్ధి పనులు అటకెక్కించారని విమర్శలు 
ప్రజాకర్షక హామీలు  కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదని విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గ్యారెంటీలను రద్దు చేస్తే అభివృద్ధి చేయవచ్చని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, యువ నిధి, గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ.2000 ఇచ్చేందుకు దాదాపు రూ.50 వేల కోట్ల బడ్జెట్‌ అవసరం అవుతోంది.  

బాంబు పేల్చిన బసవరాజ రాయరెడ్డి 
ఈ తరుణంలో సీఎం సలహాదారు బసవరాజ రాయరెడ్డి తాజాగా మరో బాంబు పేల్చారు. సోమవారం కొప్పళ జిల్లా యలబుర్గా తాలూకాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లుగానే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సమాలోచన చేస్తోందన్నారు. ఈ విషయంలో సాధక బాధకాలను పరిశీలించి ఖచ్చితంగా అమలు చేస్తుందని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. తమ ప్రభుత్వంలో నిధుల కొరత లేదని, గ్యారెంటీలను చక్కగా అమలు చేస్తున్నామని, గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళలకు రూ.2 వేలు, ఉచిత బస్సు తదితర గ్యారెంటీల ద్వారా ప్రభుత్వం హామీలు అమలు చేసిందని, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే చర్యలు తీసుకుంటుందని వివరించారు.  

Videos

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)