Breaking News

విష వాయువులు పీల్చి నలుగురి మృతి

Published on Sun, 06/07/2026 - 18:57

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో ఆదివారం సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే పని చేస్తున్న నలుగురు కార్మికులు విష వాయువులు పీల్చి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో... నిర్వహణ పనుల సమయంలో భద్రతా నిబంధనలు పాటించలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ ఘటన అశ్విని కుమార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. నగలను శుభ్రపరిచే ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు ఈ సెప్టిక్ ట్యాంక్‌లోకి వెళ్తుంటాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ట్యాంక్‌ను ప్రతి 2 నెలలకు ఒకసారి శుభ్రం చేస్తారు.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్-1) అలోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం శుభ్రపరిచే పనిలో భాగంగా ఒక సూపర్‌వైజర్, ముగ్గురు కార్మికులు ట్యాంక్‌లోకి దిగారు. లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే నలుగురూ కుప్పకూలిపోయారు. మూసివేసిన ఆ ప్రదేశంలో విష వాయువు ఉండటమే దీనికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. శ్వాస ఆడకపోవడమే వారు మృతిచెందడానికి ప్రధాన కారణమై ఉండొచ్చని, అయితే కచ్చితమైన కారణం పోస్టుమార్టం పరీక్ష తర్వాత తెలుస్తుందని తెలిపారు.

కార్మికుల వద్ద భద్రతా పరికరాలు ఎక్కడ? 
ట్యాంక్‌లోకి దిగే ముందు సూపర్‌వైజర్ అగ్నిమాపక శాఖను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రాథమిక వివరాల ప్రకారం, పనులు నిర్వహించే సమయంలో కార్మికుల వద్ద అవసరమైన భద్రతా పరికరాలు గానీ, రక్షణ సామగ్రి గానీ లేవు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. నలుగురు కార్మికులను ట్యాంక్ నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.  

నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమా? అనే అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా విధానాలు అమలు చేశారా లేదా తెలుసుకునేందుకు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించనున్నట్లు పోలీసులు తెలిపారు. బాధ్యులు ఎవరో గుర్తించనున్నారు.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)