Breaking News

కూలిన ఆనకట్ట.. నలుగురు మృతి.. ముగ్గురు గల్లంతు

Published on Wed, 09/03/2025 - 12:51

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో ఒక  ఆనకట్ట కూలి ఆకస్మిక వరద సంభవించడంతో, నలుగురు  మృతిచెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఆనకట్ట కూలిన విషయాన్ని తెలుసుకున్న అధికారులు, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. ధనేష్‌పూర్ గ్రామంలో ఉన్న లూటి జలాశయంలో మంగళవారం రాత్రి  ఈ ఘటన చోటుచేసుకుంది.

1980ల ప్రారంభంలో నిర్మించిన ఈ జలాశయంలో వరద పోటెత్తడంతో సమీపంలోని ఇళ్లు, వ్యవసాయ పొలాలోకి నీరు వచ్చిచేరింది. సమాచారం అందుకున్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల సీఎం బస్తర్ డివిజన్‌లోని వరద ప్రభావిత బస్తర్, దంతేవాడ జిల్లాలను పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా దంతేవాడ, సుక్మా, బీజాపూర్, బస్తర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించి పలు ప్రాంతాలు నీటమునిగాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన వరదలకు  ఎనిమిది మంది మరణించారు, 96 పశువులు మృత్యువాత పడ్డాయి. దాదాపు 495 ఇళ్లు, 16 కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దంతేవాడలోని చుడితిక్ర వార్డులోని సహాయ శిబిరంలో తలదాచుకున్న నిర్వాసితులను ముఖ్యమంత్రి పరామర్శించారు.

#

Tags : 1

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)