Breaking News

ఆటో డ్రైవర్‌ చెంపదెబ్బ..కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే

Published on Sat, 02/15/2025 - 18:58

బెంగళూరు:కర్ణాటక బెలగావిలో విషాదఘటన జరిగింది. గోవాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సూర్యాజీ(68) మమ్లేదార్‌ బెలగావిలో ఖాడే బజార్‌లోని ఓ లాడ్జి బుక్‌ చేసుకున్నారు. లాడ్జికి కారులో వస్తుండగా అక్కడి ఇరుకైన రోడ్డులో చిన్న ప్రమాదం జరిగింది. సూర్యాజీ కారు ఓ ఆటోను చిన్నగా ఢీకొట్టింది. ఆటోకు పెద్ద నష్టమేమీ జరగకపోయినా ఆ ఆటో డ్రైవర్‌ సూర్యాజీతో గొడవకు దిగాడు.

ఈ గొడవలో సూర్యాజీని ఆ ఆటో డ్రైవర్‌ చెంపపై కొట్టాడు. ఇది ఇక్కడితో ముగిసిన తర్వాత సూర్యాజీ లాడ్జికి చేరుకుని మెట్లు ఎక్కి తన గదిలోకి వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా సూర్యాజీ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. 

సూర్యాజీ చనిపోవడానికి గల కారణాలను డాక్టర్లు వెల్లడించాల్సి ఉంది. పోలీసులు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్‌తో గొడవతో పాటు సూర్యాజీ కుప్పకూలిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. కాగా, సూర్యాజీ గోవాలోని పొండా నియోజకవర్గానికి 2012 నుంచి 2017 దాకా ఎమ్మెల్యేగా పనిచేయడం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)