Breaking News

మోదీకీ రిటైర్మెంట్‌ ఇస్తారా?

Published on Mon, 09/23/2024 - 04:55

న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోదీ చర్యలకు ఆరెస్సెస్‌ సమాధానం చెప్పాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ‘జనతా కీ అదాలత్‌’ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భగవత్‌కు ఐదు ప్రశ్నలు సంధించారు. ‘‘75 ఏళ్లు దాటిన నేతలు పదవుల నుంచి తప్పుకోవాలని బీజేపీలో నిబంధన ఉంది. 

ఎల్‌కే అడ్వాణీ వంటి నేతకు కూడా దీన్ని వర్తింపజేశారు. ఈ నిబంధనను మోదీకి కూడా వర్తింపజేస్తారా? అడ్వాణీ మాదిరిగానే మరో ఏడాదికి మోదీని కూడా ప్రధాని పదవి నుంచి తప్పిస్తారా?’’ అని భగవత్‌ను ప్రశ్నించారు. ఆరెస్సెస్‌ను కూడా మోదీ ఖాతరు చేయడం లేదనే అర్థం ధ్వనించేలా, ‘కొడుకు చివరికి తల్లిపైకే తల ఎగరేసేంత పెద్దవాడయ్యాడా?’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

 ‘‘పారీ్టలను విచ్ఛిన్నం చేయడానికి, బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకోవడాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సమరి్థస్తోందా? నేతలపై అవినీతిపరులనే ముద్రవేసి, చివరికి వారిని బీజేపీలో చేర్చుకోవడం సంఘ్‌కు ఇష్టమేనా? బీజేపీ సాగిస్తున్న ప్రస్తుత రాజకీయాల పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా? సైద్ధాంతికంగానూ, అన్ని రకాలుగానూ బీజేపీకి మాతృ సంస్థ అయిన ఆరెస్సెస్‌ ఇక మీదట పారీ్టకి అవసరమే లేదన్న బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా వ్యాఖ్యలు విన్నాక మీకేమనిపించింది? వీటన్నింటిపై స్పందించండి. బదులివ్వండి’’ అని భగవత్‌ను కోరారు. దేశంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, పదవుల కోసం కాదని స్పష్టంచేశారు. 

రాబోయే ఎన్నికలు అగ్నిపరీక్ష   
ఏ తప్పూ చేయని తనపై అవినీతి ఆరోపణలు రావడంతో కలత చెంది సీఎం పదవికి రాజీనామా చేశానని కేజ్రీవాల్‌ అన్నారు. గత పదేళ్లలో గౌరవం సంపాదించుకున్నాను తప్పితే డబ్బు సంపాదించలేదని వ్యాఖ్యానించారు. ‘‘దసరా నవరాత్రుల తర్వాత అధికారిక నివాసం వీడతా. ప్రజలే నాకు వసతి కలి్పస్తారు’’ అన్నారు. కేజ్రీవాల్‌ ప్రశ్నలపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లిన ఆయనకు నైతిక విలువలే లేవంటూ ఎక్స్‌లో ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌కు ఐదు ప్రశ్నలు సంధించారు.  

కేజ్రీవాల్‌ రాముడు, నేను లక్ష్మణుడిని
ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌తో తనకున్నది రామలక్ష్మణుల సంబంధమని ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోడియా అభివర్ణించారు. ఏ రావణుడూ తమను విడదీయలేడంటూ బీజేపీనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జన్‌తా కీ అదాలత్‌లో సిసోడియా ప్రసంగించారు. అవినీతి రావణుడిపై పోరాటం సాగిస్తున్న రాముడు కేజ్రీవాల్‌ పక్కన లక్ష్మణుడిలా ఉంటానన్నారు.
 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)