Breaking News

మహోన్నత నాయకురాలు ఇందిరా గాంధీ 

Published on Thu, 11/20/2025 - 06:33

న్యూఢిల్లీ: దేశ తొలి, ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేశారని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్, ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ శ్లాఘించారు. పేదరికం, అసమానతల నిర్మూలనకు చిత్తశుద్ధితో పనిచేశారని, ఆమె తన అత్యుత్తమ విధానాలతో దేశ దశదిశను మార్చేశారని కొనియాడారు. 

2024 సంవత్సరానికి గాను ‘ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి’ని చిలీ దేశ తొలి, ఏకైక మహిళా అధ్యక్షురాలిగా సేవలందించిన మిషెల్‌ బచెలెట్‌కు బుధవారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ ప్రసంగించారు. అసాధారణ మహిళా నేతల్లో ఒకరైన ఇందిరా గాంధీ స్మారకార్థం 1985లో ఈ బహుమతిని ప్రారంభించినట్లు తెలిపారు.

 ప్రతికూల సమయంలోనూ న్యాయం, అభివృద్ధి, మానవాళి సంక్షేమం కోసం పోరాటం సాగించిన ఘతన ఇందిరా గాం«దీకి దక్కుతుందని అన్నారు. సామాజిక ప్రగతి, శాంతి, సుస్థిరత కోసం కృషి చేసినవారికి ఈ బహుమతి అందజేస్తున్నట్లు వెల్లడించారు. పేదరికం, వ్యాధులు, అజ్ఞానంపై మరో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనకు శాంతి కావాలని ఇందిరా గాంధీ చెప్పినట్లు సోనియా గుర్తుచేశారు. 

పీడన, పక్షపాతం, పేదరికం, హింసకు తావులేకుండా ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు ఉందన్నారు. దేశానికి ఇందిరా గాంధీ అందించిన మహోన్నత సేవలు చిరస్మరణీయమని ఉద్ఘాటించారు.  తనకు ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని ప్రదానం చేసినందుకు ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్టుకు మిషెల్‌ బచెలెట్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదొక గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇందిరా గాంధీ జీవితం, ఆమె అందించిన సేవా స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.   
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)