Breaking News

వివాదాల నడుమ ‘రాజీవ్‌’కు వీడ్కోలు

Published on Tue, 02/18/2025 - 11:36

న్యూఢిల్లీ: దేశ ఎన్నికల ప్రధాన కమిషనర్‌(సీఈసీ)గా పదవీ విరమణ చేసిన రాజీవ్‌కుమార్ తన హయంలో కొంత మేర వివాదాస్పదమయ్యారు. లోక్‌సభ ఎన్నికలతో సహా పలు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజీవ్‌కుమార్‌ పక్షపాత ధోరణితో వ్యవహరించారన్న విమర్శలొచ్చాయి. 

ముఖ్యంగా కీలక ఎన్నికల సమయాల్లో అధికార బీజేపీకి మేలు జరిగేలా వ్యవహిరించారని ప్రతిపక్షాలు పలు సందర్భాల్లో ఆయనపై ఆరోపణలు చేశాయి.దీంతో రాజీవ్‌కుమార్‌ హయంలో ఎన్నికల కమిషన్‌(ఈసీ) స్వయం ప్రతిపత్తిపై అనుమానాలు తలెత్తాయి.ఔ

ఎన్నికలప్పుడు పశ్చిమబెంగాల్‌ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికల హింసను అదుపు చేయడంలో విఫలమయ్యారన్న అపఖ్యాతిని రాజీవ్‌కుమార్‌ మూటకట్టుకున్నారనేది పలువురి వాదన. ముఖ్యంగా ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై చర్చ జరుగుతున్న వేళ రాజీవ్‌కుమార్‌ ఈవీఎంలు,వీవీప్యాట్‌లను మీడియా ఎదుటే ఏకపక్షంగా సమర్థించడం ప్రతిపక్షాల ఆగ్రహానికి కారణమైంది.

రాజీవ్‌కుమార్‌ హయాంలో పలువురు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడ్డ టైమింగ్‌ వివాదాస్పదమైంది. సీఈసీగా వీడ్కోలు వేళ రాజీవ్‌కుమార్‌ కామెంట్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల కమిషన్‌ చుట్టూ అలుముకున్న వివాదాలపై మీడియా దృష్టి ఎక్కువైందని, ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషన్‌ తన హుందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాజీవ్‌కుమార్‌ అనడం చర్చకు దారి తీసింది.

మొత్తంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌కుమార్‌ హాయంలో ఎన్నికల కమిషన్‌తో పాటు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. సాధారణ ప్రక్రియలో భాగంగా రాజీవ్‌కుమార్‌ రిటైర్‌ అయి వెళ్లిపోయినప్పటికీ దేశంలో ఎన్నికల కమిషన్‌,ఎన్నికల నిర్వహణపై తలెత్తిన అనుమానాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

 

 

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)