Breaking News

బంగ్లాదేశ్‌ పరిస్థితులను గమనిస్తున్నాం: కేంద్ర మంత్రి జైశంకర్‌

Published on Tue, 08/06/2024 - 14:53

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ పరిణామాలపై రాజ్యసభలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు  వేగంగా మారుతున్నాయని, ఢాకాలోని భారత్ దౌత్య కార్యాలయం ద్వారా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.

బంగ్లాదేశ్‌లో 19,000 మంది భారతీయులు ఉన్నారని జైశంకర్ వెల్లడించారు. వీరిలో 8,000 మంది విద్యార్థులు ఇప్పటికే భారత్ చేరుకున్నారని తెలిపారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీల వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయని, మైనార్టీల రక్షణకు అక్కడున్న సంస్థలు   చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఢాకాలోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు.

‘బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.ఆమె షార్ట్‌ నోటీసుతో ఇండియాకు వచ్చారు. బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో షేక్‌ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో భారతీయ యువకులు వెనక్కి రావాలనుకుంటున్నారు. భారతీయ యువకులను వెనక్కి రప్పించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. బంగ్లాదేశ్‌లోని భారతీయులు, మైనారిటీల భద్రతపై అక్కడి ఆర్మీతో మేము టచ్‌లో ఉన్నాం. అక్కడి శాంతి భద్రతనలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం’ అని తెలిపారు

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)