Breaking News

‘దాడి చేస్తే మరాఠీలో మాట్లాడేస్తారా?’: తమిళ అనుభవాన్ని చెప్పిన గవర్నర్

Published on Wed, 07/23/2025 - 13:39

ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న భాషా వివాదంపై రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒ‍క బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి, మరాఠీలో మాట్లాడమంటూ ఆ భాష రానివారిపై దాడి చేస్తే, వారు వెంటనే మరాఠీలో మాట్లాడగలుగుతానా?.. అలా చేస్తే అది మహారాష్ట్రకే హాని కలిగిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

తమిళనాడులో తాను  ఉన్న సమయంలో ఇలాంటి భాషా వివాదాన్ని చూశానని తెలిపారు. ఒకరోజు రాత్రి  ఒంటిగంట ప్రాంతంలో తాను కారులో ప్రయాణిస్తుండగా, రోడ్డు పక్కన ఒక వ్యక్తిపై పలువురు దాడి చేయడాన్ని తాను చూశానన్నారు. తరువాత తాను జోక్యం చేసుకుని, ఆరా తీయగా, బాధితుడు ఉత్తర భారతదేశానికి చెందిన లారీ డ్రైవర్ అని తెలిసిందన్నారు. అతను హిందీలో మాత్రమే మాట్లాడగలడని, అయితే దాడి చేసిన వారు అతనిని తమిళంలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారని తెలుసుకున్నానన్నారు.

భాషపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ప్రమాదకరమని  గవర్నర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ప్రజలను విభజించడమే కాకుండా  ఇతరులు రాష్ట్రానికి రాకుండా  ఉండేందుకు అవకాశం  ఏర్పడుతుందన్నారు. అలాంటి పరిస్థితుల్లో కొత్త పరిశ్రమలు ఇక్కడికి రావని ఆయన హెచ్చరించారు. ప్రజలంతా పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవాలని, భాష ఎప్పుడూ హింస లేదా వివక్షకు కారణం కాకూడదని గవర్నర్ పేర్కొన్నారు.

మనం మాతృభాషను చూసి గర్వపడుతూనే ఇతర బాషలను కూడా నేర్చుకోవాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. గవర్నర్ వ్యాఖ్యలను సమర్ధించిన మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ మాట్లాడుతూ ‘మరాఠీ మన మాతృభాష. అది మనకు గర్వకారణం. అయితే ఎవరైనా మరాఠీలో మాట్లాడాలని బలవంతం చేయడం లేదా వారిపై దాడి చేయడం సరైనది కాదు. మనం కూడా మహారాష్ట్రను దాటి ఎప్పుడైనా బయటకు వెళతాం. అక్కడ ఎవరైనా తమిళం లేదా బెంగాలీలో మాట్లాడాలని డిమాండ్ చేస్తే మనం ఏం చేయగలం? అని ‍ప్రశ్నించారు. అన్ని భాషలను గౌరవించాలని గిరీష్ మహాజన్ అన్నారు.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు