Breaking News

అగ్నిపథ్‌ వయోపరిమితి పెంచాలని కేంద్రానికి ఆర్మీ సూచన!

Published on Sat, 07/06/2024 - 14:30

ఢిల్లీ: అగ్నిపథ్‌ పథకంలో చేరాలనుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న 21 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 23  ఏళ్లుకు పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి  ప్రతిపాదించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. దీని వల్ల త్రివిధ దళాల్లో సాంకేతిక ఉద్యోగాలను డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల పొందే  అవకాశాలు అధికంగా ఉంటాయని శుక్రవారం సీనియర్‌ మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు.

అదే విధంగా నాలుగేళ్ల  తర్వాత  కనీసం 50 శాతం మంది ఉద్యోగులను కొనసాగించాలని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కేవలం 25 శాతం మంది అగ్నివీరుల సర్వీస్‌ మాత్రమే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము సూచించనట్లుగా 50  శాతం మంది అగ్నివీరుల సర్వీస్ కొనసాగించటం వల్ల కొన్ని ప్రత్యేకమైన విభాగాల్లో మ్యాన్ పవర్‌ కొరత తగ్గించవచ్చని మరో సైనిక అధికారి అభిప్రాయపడ్డారు. శక్తిమంతమైన సైన్యం కోసం ఈ మార్పులు అవసరమని  అ‍న్నారు. 

రెండేళ్ల వయోపరిమితి పెంచటం మూలంగా త్రివిధ దళాల్లో గ్రాడ్యుయేషన్ పర్తైన అభ్యర్థులు అధిక సంఖ్యలో నియమించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే అగ్నిపథ్‌ పథకం కింద త్రివిధ దళాల్లో నియామకానికి పదిహేడున్నరేళ్ల నుంచి 21 ఏళ్ల  వయసు గల అభ్యర్థులు అర్హులుగా ఉ‍న్నారు. ఇక నాలుగేళ్ల సర్వీస్‌ పూర్తి అయిన తర్వాత కేవలం 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే రెగ్యులర్‌ సర్వీసు కింద మరో  15 ఏళ్లకు పొడిగించనున్న విషయం తెలిసిందే.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)