Breaking News

ఆస్పత్రి ఏసీ గదిలో డాక్టర్‌ మొద్దు నిద్ర.. ఓ వ్యక్తి ప్రాణం తీసింది

Published on Tue, 07/29/2025 - 21:40

లక్నో: ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమైన స్థానికులు బాధితుణ్ణి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది స్ట్రెచర్‌పై ఆస్పత్రి వార్డుకు తరలించారు. అసలే ఓడుతున్న రక్తం.. భరించ లేని నొప్పిని తాళలేక గుండెలవిసేలా కేకలు వేస్తున్నాడు. కేకలు విన్న వైద్యులు  హుటాహుటీన వచ్చి ట్రీట్మెంట్ అందించి ఉంటే.. బాధితుడు బ్రతికేవాడు. కానీ అలా జరగలేదు. ఏసీ గదిలో హాయిగా నిద్రపోయారు. ఫలితంగా సకాలంలో వైద్యం అందక క్షతగాత్రుడు ప్రాణాలు కోల్పోయాడు.  

ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సునీల్‌ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం  లాలా లజపత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. విధుల్లో ఉన్న ఇద్దరు జూనియర్‌ డాక్టర్లు నిర్లక్క్ష్యంగా వ్యవహరించారు. విధుల్లో మొద్దు నిద్రపోవడంతో క్షతగాత్రుడు ప్రాణాలు కోల్పోయాడు. 

ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో బాధితుడు అత్యవసర వార్డులో స్ట్రెచర్‌పై ఆహాకారాలు చేస్తుండగా.. కుర్చీలో కూర్చుని జూనియర్ డాక్టర్లు భూపేశ్ కుమార్ రాయ్, అనికేత్ నిద్రపోతుండడాన్ని గమనించవచ్చు.

వీడియోలో ఓ డాక్టర్‌ ఏసీ ముందు కాళ్లు టేబుల్ మీద పెట్టుకుని నిద్రపోతుండగా.. నిద్ర పోతున్న డాక్టర్‌ ముందు ప్రిస్క్రిప్షన్ పట్టుకుని చంకలో చంటి పిల్లాడితో ఉన్న ఓ తల్లి అతడిని నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది. గంటల తరబడి ఎవరూ పట్టించుకోకపోవడంతో స్ట్రెచర్‌పై నొప్పితో, రక్తస్రావంతో బాధపడుతూ సునీల్‌ మరణించాడు. ఈ ఘటనపై లాలా లజపతిరాయ్ మెమోరియల్ (LLRM) మెడికల్ కాలేజీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు.

ఈ సంఘటన జరిగిన సమయంలో డ్యూటీ-ఇన్‌చార్జ్ డాక్టర్ శశాంక్ జిందాల్ ఆసుపత్రిలో లేరు. పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత తాను తిరిగి వెళ్లి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, కాస్ట్ ఇచ్చానని చెప్పాడు. అయితే, మరుసటి రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సునీల్ మరణించాడు. రోగిని తీసుకువచ్చినప్పటికే పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ జిందాల్ చెప్పడంపై బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరట్ జిల్లా మేజిస్ట్రేట్‌ను వివరణాత్మక విచారణ నిర్వహించాలని కోరారు. ఘటనపై ప్రభుత్వం వైద్యులను విధుల నుంచి తొలగించింది. 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)