Breaking News

సీబీఐకి ఎదురుదెబ్బ.. దాణా స్కామ్‌లో లాలూకు ఊరట

Published on Tue, 07/14/2026 - 12:41

సాక్షి, న్యూఢిల్లీ: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊరట లభించింది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. జార్ఖండ్‌ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ.. సీబీఐ చేసిన బెయిల్‌ రద్దు అభ్యర్థనను తిరస్కరించింది.

దాణా కుంభకోణంలోని డియోఘర్‌ ట్రెజరీ కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు జార్ఖండ్‌ హైకోర్టు 2021లో బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లాలూ బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎం.ఎం. సుంద్రేష్‌, జస్టిస్‌ పీబీ వరాలే ధర్మాసనం.. హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.

ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశం
అయితే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సహా పలువురి శిక్షపై దాఖలైన అప్పీల్‌ పిటిషన్లు జార్ఖండ్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఈ అప్పీల్‌ విచారణను వేగవంతం చేయాలని, సాధ్యమైనంత త్వరగా.. అంటే ఆరు నెలల్లో కేసును పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది.

దాణా కుంభకోణం కేసులో శిక్ష
1990లలో బిహార్‌లో జరిగిన దాణా కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పశువుల దాణా పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా నిధులు విత్‌డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై పలు అభియోగాలు నమోదయ్యాయి. డియోఘర్‌ ట్రెజరీ కేసులో 2018లో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూను దోషిగా తేల్చి శిక్ష విధించింది. అనంతరం ఆయన జార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించగా.. 2021లో బెయిల్‌ లభించింది.

బెయిల్‌ కొనసాగింపు.. అప్పీల్‌పై ఉత్కంఠ
తాజా సుప్రీంకోర్టు నిర్ణయంతో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ.. అసలు శిక్షపై ఉన్న అప్పీల్‌ విచారణ మాత్రం కీలకంగా మారింది. ఆరు నెలల్లో హైకోర్టు విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)