Breaking News

FM Nirmala Sitharaman: దేశ ఆర్థికమంత్రికి అప్పులు.. మరి ఆస్తులెంతో తెలుసా?

Published on Sun, 03/31/2024 - 15:22

కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసినంత డబ్బు తన దగ్గర లేదని ఇప్పటికే పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనని, ప్రచారంలో మాత్రం పాల్గొంటానని స్పష్టం చేశారు. ఒక ఆర్థిక మంత్రి దగ్గర డబ్బు లేదు అన్న మాటలు కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ.. అది నిజమే అని తాజాగా వెల్లడైన కొన్ని విషయాల ద్వారా తెలుస్తోంది.

కేంద్ర ఆర్థిక మంత్రికి కొంతవరకు ఆస్తులు ఉన్నప్పటికీ.. అప్పులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో రాజ్యసభ సభ్యురాలిగా నామినేషన్ వేసిన సమయంలో ఆమె దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆమె ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ఈమె మొత్తం ఆస్తుల విలువ రూ. 2.53 కోట్లుగా ఉంది.

నిర్మలా సీతారామన్‌కు ఉన్న మొత్తం ఆస్తిలో రూ. 1.87 కోట్ల స్థిరాస్థులు, రూ.65.55 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు సమాచారం. అప్పు రూ.26.91 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. 2016లో సీతారామన్‌ ఆస్తి విలువ రూ. 99.36 లక్షలు కాగా, 2022 నాటికి రూ. 1.7 కోట్లకు పెరిగింది. 2024 నాటికి ఈ ఆస్తి విలువ కొంత వరకు పెరిగి ఉండవచ్చు.

2016, 2022 డిక్లరేషన్‌ల ప్రకారం నిర్మలా సీతారామన్‌కు ఒక 'బజాజ్ చేతక్' స్కూటర్ ఉన్నట్లు సమాచారం. 2016లో రూ.7.87 లక్షల విలువైన 315 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. 2022 నాటికి బంగారం పరిమాణం పెరగలేదు, కానీ పెరిగిన ధరల కారణంగా ఆ బంగారం విలువ దాదాపు రెండింతలు పెరిగి రూ.14.49 లక్షలకు చేరుకుంది. ఇప్పటి ధరల ప్రకారం బంగారం విలువ రూ. 19.4 లక్షల నుంచి రూ. 21.18 లక్షల వరకు ఉంటుంది.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)