Breaking News

ఓ ఇంట్లో రూ.4.8 కోట్ల నగదు.. బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు

Published on Fri, 04/26/2024 - 12:07

బెంగళూరు, సాక్షి: కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు చిక్కబళ్లాపుర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని యలహంకలో ఓ ఇంట్లో రూ.4.8 కోట్ల నగదును ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బీజేపీ అభ్యర్థి కె.సుధాకర్‌పై కేసు నమోదు చేశారు.

చిక్కబల్లాపుర ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం రూ. 4.8 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకుందని, చిక్కబల్లాపుర నియోజకవర్గం ఎస్‌ఎస్‌టీ బృందం బీజేపీ అభ్యర్థి కె.సుధాకర్‌పై గురువారం మదనాయకనహల్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ద్వారా శుక్రవారం ప్రకటించారు.

కాగా గోవిందప్ప అనే వ్యక్తికి చెందిన నివాసంలో అధికారులు జరిపిన సోదాల్లో కట్టలకొద్దీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమానిని విచారించిన తరువాత బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తరువాత ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. 

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)