Breaking News

గ్రామాన్ని ముంచెత్తిన వరద.. అంతా బురదమయం.. వీడియో వైరల్‌..

Published on Mon, 07/10/2023 - 11:49

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదుల్లో నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కొండల నుంచి జారు వారుతున్న వరద నీరు నదీ ప్రవాహాలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో కొండ వాలులో ఉన్న మండి జిల్లాలోని ఒనైర్ గ్రామాన్ని జల ప్రవాహం చుట్టుముట్టింది. అటవీ ప్రాంతంలోని పెద్ద పెద్ద చెట్లను వేర్లతో సహా పెకిలించుకుని గ్రామంలోని మార్కెట్ ప్రాంతంపై ప్రవహించింది. ఇళ్లను, దుకాణాలను తనలో కలిపేసుకుంది. ఈ భయానక దృశ్యాలు భీతికొల‍్పుతున్నాయి. 

అటు.. ఉత్తర భారతం మొత్తం భారీ వర్షాలతో ముప్పును ఎదుర్కొంటోంది. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప‍్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. 

ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 

ఇదీ చదవండి: Himachal Pradesh Heavy Rainfalls: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)