Breaking News

మణిపూర్‌లో మళ్లీ హింస.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు మృతి

Published on Mon, 09/02/2024 - 09:07

ఇంఫాల్‌: మణిపూర్‌లో మరోమారు హింస చెలరేగింది. కుకీ-జో కమ్యూనిటీ కోరుతున్న ప్రత్యేక పరిపాలన డిమాండ్‌ను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తిరస్కరించడంతో మరోమారు హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి.

మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ దాడి నేపధ్యంలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిలిటెంట్లు.. కోట్రుక్,  పొరుగున ఉన్న కదంగ్‌బండ్‌లోని లోయ దిగువ ప్రాంతాలలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతోపాటు, బాంబు దాడులు చేశారు. కదంగ్‌బండ్ ప్రాంతంలోని ఒక ఇంటిపై డ్రోన్ నుంచి బాంబు పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, తొమ్మదిమంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయ​‍న్నారు.

పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర, కేంద్ర విభాగాలతోపాటు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కొట్రుక్ గ్రామస్తులపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. వారిని భయభ్రాంతులకు గురిచేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మణిపూర్‌ సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు.

#

Tags : 1

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)