నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

Published on Sun, 12/03/2023 - 05:01

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరం ముగిసింది. ఓటింగ్‌ యంత్రాల్లో నిక్షిప్తమైన నేతల భవితవ్యం ఆదివారం వెల్లడి కానుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాయి. నెలన్నరకు పైగా ప్రచారంలో నిరంతరాయంగా చెమటోడ్చి విశ్రాంతి తీసుకుంటున్న అభ్యర్థులు, నేతల్లో ఫలితాలపై చెప్పలేనంత ఉత్కంఠ నెలకొంది. ఐదో రాష్ట్రమైన మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారానికి వాయిదా పడింది. వీటిని కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మూడుచోట్ల ముఖాముఖి
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముఖాముఖి పోరు సాగింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, మిగతా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని మట్టికరిపించిన కాంగ్రెస్, అదే ఊపులో తాజా ఎన్నికల్లో మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తానని ఆశాభావంతో ఉంది. ఈసారి రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లు తమ వశమవుతాయని బీజేపీ భావిస్తోంది. ఈసారి మధ్యప్రదేశ్‌లో బీజేపీకి బాగా మొగ్గుందని, రాజస్తాన్‌లో ఆ పార్టీ ముందంజలో ఉందని గురువారం వెలువడ్డ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలో కాంగ్రెస్‌కే విజయావకాశాలున్నట్టు తేల్చాయి. హోరాహోరీ పోటీ నేపథ్యంలో హంగ్‌ వచ్చే చోట ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించేందుకు రెండు పారీ్టలూ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం.

ఉదయం ఎనిమిదికి షురూ
► నాలుగు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
► తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు.
► అనంతరం 8.30గంటలకు నుంచి ఓటింగ్‌ యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.  

మధ్యప్రదేశ్‌
రాష్ట్రంలో 52 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్‌ సాగుతోంది. ఇక్కడ 2,533 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. గురువారం నాటి ఎగ్జిట్‌ పోల్స్‌లో మూడు బీజేపీకి ఘనవిజయం ఖాయమని పేర్కొన్నాయి. 2018 మాదిరిగా రెండు పార్టీలూ విజయానికి దగ్గరగా వస్తాయని మరికొన్ని అంచనా వేశాయి. ఒకట్రెండు కాంగ్రెస్‌ విజయాన్ని సూచించాయి. భారీ మెజారిటీతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుని తీరుతుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ శనివారం ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు ఈసారి మార్పుకే ఓటేశారని పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114 సీట్లు సాధించగా బీజేపీ 109 స్థానాలతో సరిపెట్టుకుంది.

రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 230
మెజారిటీ మార్కు: 116

రాజస్తాన్‌
ఈ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం రాజస్తాన్‌ ప్రజల అలవాటు. ఈ ఆనవాయితీ ఈసారీ కొనసాగుతుందని, మోదీ మేనియా తోడై తమకు అధికారం కట్టబెడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీఎం గెహ్లోత్‌ మాత్రం ఈసారి ఆనవాయితీ మారుతుందని నమ్మకం పెట్టుకున్నారు. తన సంక్షేమ పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచి్చన నాటినుంచీ గెహ్లోత్‌పై కారాలూ మిరియాలూ నూరుతూ వస్తున్న కాంగ్రెస్‌ యువ నేత సచిన్‌ పైలట్‌ ప్రచార పర్వంలో మాత్రం సంయమనం పాటించారు.
రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 200
మెజారిటీ మార్కు: 101

ఛత్తీస్‌గఢ్‌
రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్‌ సాగుతోంది. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు 90 మంది రిటర్నింగ్‌ అధికారులు, 416 మంది సహాయ రిటరి్నంగ్‌ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. రాష్ట్రంలో మొత్తం 1,181 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్‌ నుంచి సీఎం భూపేశ్‌ బఘెల్, ఉప ముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ తదితర ప్రముఖులున్నారు.  
రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 90
మెజారిటీ మార్కు:46

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)