Breaking News

ఉప్పు లోడింగ్‌: స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కంటైనర్ల ప్రయోగం విజయవంతం

Published on Tue, 02/10/2026 - 21:25

గాంధీనగర్‌:  ఉప్పు లోడింగ్‌ కోసం తొలిసారి నిర్వహించిన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కంటైనర్ల పరీక్ష విజయవంతమైంది. గుజరాత్‌ రాష్ట్రంలో భీమసర్–గాంధీధామ్ విభాగంలో భారతీయ రైల్వేలు తొలిసారి స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లను ఉపయోగించి ఉప్పు లోడింగ్ ట్రయల్ నిర్వహించాయి.  ఇది సక్సెస్‌ఫుల్‌ ట్రయల్‌గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. 

 

ఉప్పు ఒక అత్యంత కరిమి  పదార్థం కావడంతో సాధారణ కంటైనర్లు త్వరగా దెబ్బతింటాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యేకంగా రూపొందించిన స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లు ఉపయోగించేందుకు వేసిన తొలి అడుగు విజయవంతమైంది. 

ఉప్పు వల్ల కలిగే తుప్పు సమస్యను తగ్గడమే కాకుండా సాధారణ కంటైనర్ల కంటే ఎక్కువకాలం ఉపయోగించవచ్చు. వేగంగా, సురక్షితంగా లోడింగ్ మరియు అన్‌లోడింగ్ చేయడానికి అనుకూలంగా రూపొందించబడ్డాయి. యాంత్రిక పద్ధతుల్లో పెద్ద ఎత్తున లోడింగ్ అనేది సులభతరం అవుతుంది. ఉప్పు చిందర వందర కాకుండా సమర్థవంతంగా రవాణా చేయడానికి వీలుగా ఉండటంతో తక్కువ వృథానే అవుతుంది. 

దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఉప్పు ఉత్పత్తి ప్రాంతాలకు సురక్షితంగా ఆధునిక రవాణా పరిష్కారం అందిస్తుంది.  రైల్వే ఫ్రైట్ ఆపరేషన్లు మరింత వేగవంతం అవుతాయి. ఈ ట్రయల్ విజయవంతం కావడం వల్ల, భవిష్యత్తులో ఉప్పు రవాణా కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్ల వినియోగం విస్తృతంగా పెరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉంచితే, భీమసర్–గాంధీధామ్ విభాగం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. ఇది భారతీయ రైల్వేలోని పశ్చిమ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. భీమసర్ అనేది కచ్ ప్రాంతంలోని ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్. 

గాంధీధామ్ అనేది కచ్‌లోని ప్రధాన వాణిజ్య కేంద్రం, కాండ్లా పోర్ట్‌కు దగ్గరగా ఉండటం వల్ల రైల్వే రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విభాగం ద్వారా ఉప్పు, బొగ్గు, ఖనిజాలు, పెట్రోకెమికల్ ఉత్పత్తులు వంటి వస్తువులు పెద్ద ఎత్తున రవాణా అవుతాయి.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)