Breaking News

నారీశక్తి నూతనాధ్యాయం లిఖిస్తా

Published on Tue, 03/12/2024 - 05:23

సాక్షి, న్యూఢిల్లీ/గురుగ్రామ్‌: ఎన్‌డీఏ ప్రభుత్వం మూడో దఫా కొలువుతీరడం ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. హ్యాట్రిక్‌ పాలనలో మహిళల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం పాటుపడుతుందని ప్రకటించారు. నారీశక్తి అభివృద్ధిలో నూతన అధ్యయనం లిఖిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ‘సశక్తి–నారీశక్తి’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.

‘గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు మహిళల కష్టాలు, కన్నీళ్లను ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు. మా ప్రభుత్వాలు మహిళలను ప్రతిదశలోనూ చేయి అందించిమరీ వారి అభ్యున్నతికి పాటుపడ్డాయి. మరుగుదొడ్ల లేమి, శానిటరీ ప్యాడ్‌ల వాడకం, వంటచెరకు వాడకంతో వంటగదుల్లో పొగచూరిన మహిళల బతుకులపై మాట్లాడిన ఏకైక ప్రధాని మంత్రిని నేనే. మహిళలందరికీ బ్యాంక్‌ ఖాతాలు ఉండాలని ఎర్రకోట వేదికగా పిలుపునిచ్చా’’ అని మోదీ వ్యాఖ్యానించారు.  

1,000 మంది ‘నమో డ్రోన్‌ దీదీ’లకు డ్రోన్లు
సశక్తి–నారీశక్తి కార్యక్రమంలో భాగంగా స్వయంసహాయక బృందాలకు దాదాపు రూ.8,000 కోట్ల బ్యాంక్‌ రుణాలను మోదీ అందజేశారు. ఈ సందర్భంగా వారిలో కొందరితో మోదీ స్వయంగా మాట్లాడారు. స్వావలంభనతో అభివృద్ధిలోకి వచి్చన వారిని మెచ్చుకున్నారు. దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన–నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ కార్యక్రమం మద్దతుతో లక్షాధికారులుగా మారిన ‘లఖ్‌పతి దీదీ’లను ఈ సందర్భంగా మోదీ సత్కరించారు. వ్యవసాయం, సాగు సంబంద పనుల్లో డ్రోన్లను వినియోగంచడంలో ఇప్పటికే తర్ఫీదు పొందిన 1,000 మంది ‘నమో డ్రోన్‌ దీదీ’లకు మోదీ డ్రోన్లను పంపిణీచేశారు. మూలధన సంబంధ నిధి కింద స్వయం సహాయక బృందాలకు మరో రూ.2,000 కోట్లను మోదీ పంపిణీచేశారు.

ప్రతికూల మనస్తత్వానికి ప్రతిబింబం..
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు సానుకూల మనస్తత్వం ఏ కోశానా లేదని మోదీ విమర్శించారు. దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు వీలుగా 112 జాతీయ రహదారులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)