Breaking News

అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదం.. ఏ క్షణం.. ఏం జరిగింది?

Published on Wed, 01/28/2026 - 19:02

ఢిల్లీ: అజిత్ పవార్ విమాన ప్రమాదానికి పైలెట్ తప్పిదమే కారణమనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రీడ్ బ్యాక్ ల్యాండింగ్ క్లియరెన్స్ ఇవ్వని పైలట్లు.. రన్ వే సరిగ్గా కనిపించక అంచనా తప్పినట్లు సమాచారం. తొలి ప్రయత్నంలో పైలట్లు ల్యాండ్‌ చేయలేకపోయారు. రెండో ప్రయత్నంలో 8:44కు విమానం ప్రమాదానికి గురైంది.  విమానం ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) ఇచ్చిన సూచనలకు పైలట్ ఇచ్చే సమాధానమే రీడ్‌బ్యాక్..

విమానం రెండోసారి ల్యాండింగ్ కోసం సిద్ధమవగా.. మొదట రన్‌వే కనిపించడం లేదని చెప్పిన పైలట్లు.. కొన్ని సెకన్ల తర్వాత రన్‌వే కనిపిస్తోందని తెలిపారు. ఉదయం 8:43 గంటల సమయంలో విమానానికి రన్‌వే 11పై ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. అయితే, సాధారణంగా పైలట్లు ఇచ్చే తిరుగు సమాధానం (Readback) ఈసారి రాలేదు. సరిగ్గా నిమిషం తర్వాత, రన్‌వే వద్ద పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం ఏటీసీ గుర్తించింది. అయితే.. ఈ దుర్ఘటనలో విమానం ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు పైలట్ రీడ్‌బ్యాక్ చేయకపోవడం ప్రమాదానికి దారి తీసినట్లు కేంద్రం పేర్కొంది. 

ఏ క్షణం.. ఏం జరిగింది?
👉ఉదయం 8:18 నిమిషాలకు తొలిసారిగా బారామతి ఎయిర్ ఫీల్డ్‌ను కాంటాక్ట్ చేసిన విమానం
👉30 నిమిషాల తర్వాత పూణే ఎయిర్ కంట్రోల్ నుంచి బారామతికి కంట్రోల్‌లోకి విమానం
👉విజిబులిటీ, గాలి వేగం గురించి అడిగిన పైలట్లు.. 3000 మీటర్ల విజిబిలిటీ, సాధారణ గాలి వేగం
👉రన్ వే 11 పై ల్యాండింగ్ కోసం ఫైనల్ అప్రోచ్‌కు సిద్ధమైన ఎయిర్ క్రాఫ్ట్
👉ఫస్ట్ అప్రోచ్‌లో రన్ వే కనిపించకపోవడంతో గో అరౌండ్‌కు వెళ్లిన విమానం
👉గో అరౌండ్ తర్వాత.. విమానం పొజిషన్ గురించి అడిగిన పైలెట్.. మరోసారి ఫైనల్ అప్రోచ్‌కు సిద్ధమైన ఎయిర్ క్రాఫ్ట్ 
👉రన్ వే కనిపిస్తుందా? అని అడిగిన ఏటిసీ..
👉ప్రస్తుతం కనిపించడం లేదు.. కనిపించిన తర్వాత కాల్ చేస్తామన్న పైలెట్
👉కొన్ని సెకన్ల తర్వాత రన్‌ వే కనిపిస్తుందని వెల్లడించిన పైలెట్ 
👉ఉదయం 8:43 నిమిషాలకు రన్‌ వే లెవెన్‌పై ల్యాండింగ్ క్లియరెన్స్.. అయితే కీలకమైన "రీడ్ బ్యాక్ ల్యాండింగ్ క్లియరెన్స్" సమాధానం ఇవ్వని పైలట్
👉ఉదయం 8:44 నిమిషాలకు రన్‌వే పక్కన భారీ ఎత్తున మంటలు..  క్రాష్ అయిన విమానం
👉రన్‌ వే 11కు ఎడమ వైపున విమాన శకలాలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)