Breaking News

ఐదేళ్లలో ఎరువుల రాయితీ  రూ. 9.7 లక్షల కోట్లు 

Published on Mon, 08/18/2025 - 05:16

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో రైతన్నలపై ఎరువుల ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో రికార్డు స్థాయిలో రాయితీ చెల్లించింది. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆగస్టు 7వ తేదీ వరకు ఎరువుల తయారీదారులు, దిగుమతిదారులకు రాయితీ కింద రూ.9.7 లక్షల కోట్లకు పైగా విడుదల చేసినట్లు కేంద్ర ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. 

కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీ రూ.83,467.85 కోట్లు కాగా, 2020–21లో అది రూ. 1,31,229.51 కోట్లకు చేరింది. 2021–22లో రూ.1,57,640.08 కోట్లు, 2022–23లో రికార్డు స్థాయిలో రూ.2,54,798.93 కోట్లు, 2023–24లో రూ.1,95,420.51 కోట్లు, 2024–25లో రూ.1,77,129.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరం ఆగస్టు 7 వరకు రూ.62,983.61 కోట్ల సబ్సిడీ భారం భరించినట్లు మంత్రి వెల్లడించారు.  

పెరిగిన ఉత్పత్తి.. తగ్గిన దిగుమతులు  
2019–20లో దేశంలో 425.95 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు ఉత్పత్తి కాగా, 2023–24 నాటికి ఇది 503.35 లక్షల టన్నులకు చేరుకుంది. 2024–25లో 517.90 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, 2025–26లో జూన్‌ వరకు 120.63 లక్షల టన్నుల ఎరువులు ఉత్పత్తి అయిననట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. మరోవైపు విదేశాల నుంచి ఎరువుల దిగుమతులు క్రమంగా తగ్గుతుండడం ప్రభుత్వానికి ఊరటనిస్తోంది. దిగుమతులు 2019–20లో 184.09 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, 2023–24లో 176.95 లక్షల టన్నులకు, 2024–25లో 160.29 లక్షల టన్నులకు తగ్గాయి. 2025–26లో జూలై వరకు 48.54 లక్షల టన్నుల ఎరువులు దిగుమతి అయ్యాయి.   
 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)