Breaking News

‘రాముడు హిందువులకే దేవుడు కాదు.. అందరివాడు’

Published on Sat, 12/30/2023 - 16:15

జమ్మూకశ్మీర్‌: ఆయోధ్యలో రామమందిర ప్రారంభం 2024 జనవరి 22న జరగనుంది. రామమందిర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా రామమందిర ఏర్పాట్లపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాత్రిపగలు కష్టపడిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌దేశంలో సోదరభావంగా తగ్గిపోతోందని దానిని పునరుద్దరించాలని అన్నారు.

రాముడు కేవలం హిందువలకు మాత్రమే సంబంధించి దేవుడు కాదని..  ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సంబంధించిన దేవుడని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దేశ ప్రజలందరికీ  తెలియజేస్తున్నానని చెప్పారు. భగవన్‌ రాముడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ దేవుడని అన్నారు. ఈ విషయం ఆధ్యాత్మిక చరిత్ర గ్రంథాల్లో సైతం రాయబడి ఉందని తెలియజేశారు. అయితే రాముడు సోదరభావం, ప్రేమ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఐకమత్యంతో ఉండాలని గొప్ప సందేశాన్ని ఇచ్చారని తెలిపారు.

మతాలకు  సంబంధం లేకుండా అందరిని సమభావంతో చూడాలని రాముడి సందేశాల్లో ఉందని తెలిపారు. ఆయన విశ్వమానవులకు ఈ సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో రాముడు చెప్పిన సోదరభావం కొరవడిందని.. ప్రజలంతా కూడా సోదరభావాన్ని పాటించాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.

మరోవైపు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానిమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాజకీయ ప్రముఖులు హాజరుకాన్నారు. కాగా.. కొంతమంది ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానం అందగా.. మరికొంత మందిని  ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవటం గమనార్హం. ఇక బీజేపీ రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవాన్ని రాబోయే 2024 పార్లమెంట్‌ ఎన్నికలకు ఒక పావుగా మలుచుకుంటోందని ప్రతిపక్షాలు  ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే.  

చదవండి: Varanasi: కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు!

Videos

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు