Breaking News

ఆవుపై సింహం దాడి.. ఆ రైతు ఏం చేశాడంటే.. 

Published on Fri, 06/30/2023 - 19:01

గుజరాత్: ఒక రైతు సింహం బారి నుండి తన ఆవును రక్షించుకోవడానికి ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. చివరకు ఎలాగోలా సింహాన్ని భయపెట్టి గంగిగోవును కాపాడుకున్నాడు. 

గుజరాత్ లోని గిర్ సోమ్ నాట్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చగడ్డిని ఆదమరచి తింటోన్న ఆవుపై అక్కడే మాటు వేసి ఉన్న ఆడ సింహం ఒక్క ఉదుటున దూకి దాని గొంతు పట్టుకుంది. పాపం ఆ ఆవు నొప్పితో విలవిలలాడిపోయింది. పంటిబిగువున నొప్పిని భరిస్తూ తన యజమానికి వినిపించేలా పెద్దగా అరిచింది. 

తన గోవు అరుపులు విన్న ఆ రైతు వెంటనే అక్కడికి చేరుకొని ఎలాగైనా తనని కాపాడుకోవాలన్న ప్రయత్నంలో ధైర్యంగా సింహం వైపు నడుచుకుంటూ వచ్చాడు. చెయ్యెత్తి అరుస్తూ సింహాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. సింహం పట్టు నుండి విడిపించుకునే ప్రయత్నంలో  ఆవు రోడ్డు పక్కకు జరిగింది. అంతలో తనవైపుగా వస్తోన్న రైతును చూసిన సింహం భయపడి వెంటనే అవును విడిచిపెట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోయింది.

ఈ వీడియోని జునాగఢ్ లోని కేశోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. చాలా తక్కువ  వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు సింహానికి ఎదురెళ్ళిన ఆ రైతు గుండె ధైర్యానికి ఫిదా అయ్యి కామెంట్లు పెడుతున్నారు.  

ఇది కూడా చదవండి: ట్రాఫిక్ చలాన్ల స్కాం: పోలీసులే దొంగలైతే.. రూ. 3.23 కోట్లు స్వాహా..            

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)