Breaking News

కోటీశ్వరుణ్ణి చేసిన వెల్లుల్లి సాగు.. రూ 25 లక్షలకు రూ. కోటి ఆదాయం!

Published on Wed, 02/21/2024 - 08:23

దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు కిలో రూ.70-80 పలికిన వెల్లుల్లి ఇప్పుడు రూ.400-500కు చేరింది. దీనివల్ల సామాన్యులపై భారం పడినా, వెల్లుల్లి పండించిన రైతులు అత్యధిక లాభాలతో ఆనందంలో మునిగితేలుతున్నారు. 

మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన రైతు రాహుల్ దేశ్‌ముఖ్ వెల్లుల్లిని విక్రయించడం ద్వారా కోటి రూపాయల లాభం పొందాడు. 25 లక్షల పెట్టుబడితో రాహుల్ ఇంతటి లాభం పొందాడు. కాగా రాహుల్‌ తన వెల్లుల్లి పంటను కాపాడుకునేందుకు పొలాల్లో సీసీ కెమెరాలను అమర్చుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం రాహుల్‌ సౌరశక్తితో నడిచే సీసీ కెమెరాలను అమర్చాడు. రాహుల్ దేశ్‌ముఖ్ ఛింద్వారాకు 20 కిలోమీటర్ల దూరంలోని సవారి గ్రామంలో ఉంటున్నాడు. 

రాహుల్ దేశ్‌ముఖ్ దాదాపు 13 ఎకరాల్లో వెల్లుల్లిపాయలు సాగుచేశాడు. ఇంకా మిగిలిన తన పొలంలో టమాటా సాగు చేశాడు. అయితే కొద్దిరోజుల క్రితం అతని పొలంలో 25-30 కిలోల టమోటాలు అపహరణకు గురయ్యాయి. ఆ తర్వాత రాహుల్ దేశ్‌ముఖ్ రూ.10వేలు వెచ్చించి పొలాన్ని పర్యవేక్షించేందుకు మూడు సీసీ కెమెరాలు అమర్చాడు. రాహుల్ పొలంలో దాదాపు 150 మంది కూలీలు పనిచేస్తున్నారు. 

రాహుల్ దేశ్‌ముఖ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే పెద్దఎత్తున వెల్లుల్లి సాగు చేశానని తెలిపాడు. పెరుగుతున్న వెల్లుల్లి ధరలను దృష్టిలో ఉంచుకుని , వాటిని సాగుచేస్తున్నానని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా  పొలంలో సీసీ కెమెరాలు అమర్చానని అన్నాడు. రాహుల్  తాను పండించిన వెల్లుల్లిని  హైదరాబాద్‌కు కూడా పంపే యోచనలో ఉన్నాడు.

వెల్లుల్లి ధరల్లో ఇంత భారీ పెరుగుదల ఇటీవలి కాలంలో ఎన్నడూ లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వెల్లుల్లి ధర గరిష్టంగా రూ.80-90 వరకు మాత్రమే ఉంటుందని రైతులు చెబుతున్నారు. చింద్వారాలోని బద్నూర్‌లో నివసించే మరో రైతు పవన్ చౌదరి కూడా తన 4 ఎకరాల పొలంలో వెల్లుల్లిని నాటాడు. ఇందుకు రూ.4 లక్షలు ఖర్చు చేయగా, ఇప్పటి వరకు రూ.6 లక్షల లాభం వచ్చింది. తన పొలాన్ని పర్యవేక్షించేందుకు ఆయన కూడా మూడు సీసీ కెమెరాలను అమర్చాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)