Breaking News

నల్ల జెండాలు ఎగురవేయాలంటూ రైతు సంఘాల పిలుపు

Published on Fri, 03/22/2024 - 13:11

సాక్షి, చండీగఢ్‌ : కేంద్రం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ రైతులు నల్లజెండాలు ఎగురవేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) పిలుపునిచ్చాయి.

పంటలకు కనీస మద్దతు ధర (MSP), స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అమలు, గతంలో చేపట్టిన ఆందోళనల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు సాయం అందించడం సహా ఇతర డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’కు పిలుపునిచ్చాయి. 

రైతుల ఆందోళనల్ని ప్రారంభించి 38 రోజులు పూర్తైన సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. రైతుల ఉద్యమం సందర్భంగా హర్యానా పోలీసులు జరిపిన కాల్పుల్లో పంజాబ్ యువ రైతు శుభకరన్ మరణించారు. దీంతో ఆయనకు నివాళులు అర్పించేందుకు ప్రారంభించిన ‘అస్తి కలశ్‌ యాత్ర’ లక్షలాది మంది దర్శించుకుని నివాళులర్పించినట్లు రైతు నాయకులు తెలిపారు.   

ఆస్తి కలశ్‌ యాత్ర తర్వాత మార్చి మార్చి 31 అంబాలాలోని మోహ్రా మండిలో శుభకరన్ సింగ్‌కు అంకితం చేస్తూ ఏర్పాటు భారీ ఎత్తున సంతాప సభను ఏర్పాటు చేసినట్లు, ఈ సభలో ఎస్‌కేఎం, కేఎంఎం రైతు నాయకులు పాల్గొనున్నారు.  

బక్సర్ జిల్లాలో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు, వారి కుటుంబాలపై దాడిని ఖండిస్తూ, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని నేతలు అన్నారు. పోలీసులు ఇళ్లలోకి చొరబడి మహిళలు, వృద్ధులను కొట్టిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని రైతు నాయకులు బల్దేవ్‌ జిరా చెప్పారు. మార్చి 23న శంభు, ఖానౌరీలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పిన రైతు నాయకులు.. లడఖ్‌లోని రైతులు కూడా ఈ పోరాట యాత్రలో పాల్గొంటారని వెల్లడించారు. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)