Breaking News

ఎన్డీఏ,‘ఇండియా’ టఫ్‌ ఫైట్‌ .. వేలు కోసుకున్న యువకుడు

Published on Sat, 06/08/2024 - 10:47

రాయ్‌పూర్‌: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడడం సాధారణమే. అయితే ఆయా పార్టీల కరుడుగట్టిన ఫ్యాన్స్‌కు మాత్రం గెలుపు ఓటములను అంత ఈజీగా తీసుకోరు. ఇలాంటి కోవకే చెందిన బీజేపీ అభిమాని ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో తన వేలును కోసి దుర్గామాతకు సమర్పించుకున్నాడు.

బలరాంపూర్‌కు చెందిన దుర్గేష్‌పాండే బీజేపీ అభిమాని. జూన్‌4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తొలి ట్రెండ్స్‌లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ఆశించిన స్థాయిలో లీడ్‌లోకి రాలేదు. ఒక దశలో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టిపోటీ ఇచ్చింది. దీంతో నిరాశ చెందిన దుర్గేష్‌ పాండే ఫలితాలు చూడడం ఆపేసి దగ్గర్లోని ఖాళీ మాత గుడికి వెళ్లి మొక్కుకుని వచ్చాడు. 

చివర్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్‌ ఫిగర్ దాటడంతో  ఆనందంతో గుడికి వెళ్లి తన వేలును కోసి ఖాళీ మాతకు సమర్పించుకున్నాడు. గాయం తీవ్రమవడంతో దుర్గేష్‌ కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వేలు తెగిపోయి అప్పటికే ఆలస్యమవడంతో డాక్టర్లు దానిని తిరిగి అతికించలేకపోయారు. ప్రస్తుతం దుర్గేష్‌ ఆరోగ్యం స్థిరంగా ఉంది.

ఫలితాల ఆరంభంలో కాంగ్రెస్‌కు లీడ్‌ రావడంతో తట్టుకోలేకపోయానని, అందుకే ఖాళీ మాతకు మొక్కుకుని, ఎన్డీఏ గెలిచాక మొక్కు తీర్చుకున్నానని దుర్గేష్‌  చెప్పాడు.  ఎన్డీఏకు 400 సీట్లు వస్తే ఇంకా ఆనందపడేవాడినన్నాడు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)