Breaking News

'తగ్గేదేలే..! విజయం సాధిస్తాం.. సల్మాన్‌ను చంపేస్తాం..'

Published on Mon, 06/26/2023 - 19:04

ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. సల్మాన్‌ను చంపేస్తామని కెనడాకు చెందిన పరారీలో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ హెచ్చరించాడు. సల్మాన్‌ తమ కిల్‌ లిస్ట్‌లో ఉన్నాడని వెల్లడించాడు. హీరో సల్మాన్‌ను చంపేస్తామని గత మార్చిలోనే మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్యూలో గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సింగర్, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసే వాలా హత్యలో ‍గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ కీలక సూత్రధారి అని ఆరోపణలు కూడా ఉన్నాయి. 

'మేము ఇంతకు ముందే చెప్పాం. ఒక్క సల్మాన్‌నే కాదు.. జీవించి ఉన్నతం కాలం మా శత్రువులను చంపేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. సల్మాన్‌ను మాత్రం ఖచ్చితంగా చంపేస్తాం. అందుకు మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయ్. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం.' అని గోల్డీ బ్రార్ తెలిపారు.

గత మార్చిలోనే సల్మాన్ ఖాన్ సన్నిహితుడైన ప్రశాంత్ గుంజాల్కర్‌కు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. హీరో సల్మాన్‌ను చంపేస్తామని అందులో పేర్కొన్నారు. గతంలో అరెస్టైన లారెన్స్ భిష్ణోయ్‌ అంశంలో గోల్డీ బ్రార్‌ సల్మాన్‌తో మాట్లాడాలనుకుంటున్నట్లు ఆ మెయిల్‌లో కోరారు. అప్పట్లో ఆ మెయిల్‌లపై గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ భిష్ణోయ్‌, గోల్డీ బ్రార్‌లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. 

కెనడాలో టాప్ 25 మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఉన్నాడు. ప్రస్తుతం బ్రార్ కెనడాలోనే ఉన్నారని చాలా మంది విశ్వసిస్తారు. ఇండియాలో చాలా క్రిమినల్ నేరాల్లో అతని హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. కెనడాలో మాత్రం అతనిపై ఎలాంటి క్రిమినల్ నేర చరిత్ర ఆధారాలు లేనట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. గన్‌తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్..

   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)