Breaking News

ఐదేళ్లలో రూ. 300 కోట్లు.. నకిలీ వీసా ముఠా గుట్టురట్టు

Published on Sun, 09/15/2024 - 21:11

ఢిల్లీ: నకిలీ వీసాలు తయారు చేసి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. సెప్టెంబర్‌ 2 తేదీన సందీప్‌ అనే వ్యక్తి నకిలీ స్వీడిష్‌ వీసాతో ఇటలీ వెళ్లేందుకు ప్రయత్నించగా  ఢిల్లీ ఎయిర్‌పోర్టులో  ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పట్టుబడ్డాడు. దీంతో ఓ భారీ నకిలీ వీసా రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు సుమారు నాలుగైదు వేలకుపైగా నకిలీ వీసాలు తయారు చేసి ఈ ముఠా రూ. 300 కోట్లు సందపాదించనట్లు అధికారులు  పట్టుపడిన సందీప్‌ అనే వ్యక్తి తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్ అలీ అనే ఏజెంట్ ద్వారా రూ. 10 లక్షలకు సందీప్‌ నకిలీ వీసా పొందాడు. దీంతో పోలీసులు ఆసిఫ్ అలీతో పాటు అతని సహచరులు శివ గౌతమ్, నవీన్ రానాలను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో శివ గౌతమ్.. ఈ  ముఠాతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ఏజెంట్ల బల్బీర్ సింగ్ , జస్విందర్ సింగ్ పేర్లను చెప్పాడు.  వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలోని మనోజ్ మోంగా అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలో పలు దేశాలకు చెందిన నకిలీ వీసాలు తయారు చేసినట్లు వారు వెల్లడించారు. 

పోలీసులు తిలక్ నగర్‌లోని ఫ్యాక్టరీపై దాడి చేసి గ్రాఫిక్ డిజైన్‌లో డిప్లొమా చేసిన మనోజ్ మోంగాను అరెస్ట్‌ చేశారు. ఐదు సంవత్సరాల క్రితం.. జైదీప్ సింగ్ అనే వ్యక్తిని  మనోజ్ కలిశాడు. మనోజ్‌ గ్రాఫిక్ డిజైనింగ్‌ స్కిల్స్‌ చూసి.. జైదీప్‌ నకిలీ వీసాలను తయారుచేయమని ప్రోత్సహించాడు. అంతేకాకుండా వాటిని సంబంధిచి అవసరమైన సామగ్రిని కూడా అందించాడు. ఈ ముఠా ప్రతి నెలా 30 నుంచి  60 నకిలీ వీసాలు తయారు చేస్తుంది. కేవలం 20 నిమిషాల్లో వీసా స్టిక్కర్‌ను సిద్ధం చేస్తారు. ప్రతి నకిలీ వీసాకు సుమారు 8 నుంచి 10 లక్షలకు విక్రయిస్తారు. టెలిగ్రామ్, సిగ్నల్‌, వాట్సాప్‌లను ద్వారా విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వ్యక్తులతో మాట్లాడి నకిలీ వీసాలు అందిస్తారు.

ఇప్పటి వరకు ఈ ముఠాలో ఆరుగురిని అరెస్టు చేశామని, 16 నేపాలీ పాస్‌పోర్ట్‌లు, రెండు భారతీయ పాస్‌పోర్ట్‌లు, 30 వీసా స్టిక్కర్లు, 23 వీసా స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని ఐజీఐ ఎయిర్‌పోర్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఉషా రంగరాణి తెలిపారు. నకిలీ వీసాల తయారీలో ఉపయోగించిన ప్రింటర్లు, లామినేటింగ్ షీట్లు, ల్యాప్‌టాప్‌ల ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

చదవండి: బాలికపై లైంగిక దాడి.. తృణమూల్‌ నేత అరెస్టు

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)