Breaking News

ఓ ప్రత్యేక ప్రక్రియ 

Published on Tue, 09/09/2025 - 05:11

సాక్షి, న్యూఢిల్లీ: కేవలం పార్లమెంటు సభ్యులు మాత్రమే పాల్గొనే ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రత్యేకమైనది. ’నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం’లో ’ఏక బదిలీ ఓటు’ పద్ధతి ద్వారా ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. అంటే ప్రతి ఎంపీ బ్యాలెట్‌ పత్రంపై ఉన్న అభ్యర్థులకు తమ ప్రాధాన్యత క్రమాన్ని కేటాయించాల్సి ఉంటుంది. 

బ్యాలెట్‌ పత్రాలపై ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఎంపీలు తమకు ఇష్టమైన అభ్యర్థి పేరు పక్కన ’1’ అని రాయడం ద్వారా తమ మొదటి ప్రాధాన్యతను సూచించాలి. ఈ అంకెను భారతీయ సంఖ్యలలో, రోమన్‌ సంఖ్యలలో లేదా ఏదైనా భారతీయ భాషలోని సంఖ్యలలో రాయవచ్చు, కానీ అక్షర రూపంలో రాయకూడదు. 

సంక్లిష్టమైన లెక్కింపులు ఉండవు 
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లా ఓటు విలువలో సంక్లిష్టమైన లెక్కింపులు ఉండవు. ఈ ఎన్నికల్లో పాల్గొనే ప్రతి ఎంపీ ఓటు విలువ ’ఒకటి’ (1) గానే పరిగణిస్తారు. గెలవడానికి అభ్యర్థి మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 50% కంటే ఎక్కువగా (కోటా) మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ మొదటి రౌండ్‌లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే, తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తొలగించి, వారి రెండవ ప్రాధాన్యత ఓట్లను మిగతా అభ్యర్థులకు బదిలీ చేస్తారు.  

పోటీ ఉంటేనే పోలింగ్‌ 
భారత రాజ్యాంగం ప్రకారం, ఉప రాష్ట్రపతి పదవీకాలం ఐదేళ్లు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి పదవీకాలం ముగిసేలోపు కొత్తవారిని ఎన్నుకోవడం రాజ్యాంగ బద్ధమైన విధి. ఒకవేళ అధికార, విపక్ష కూటముల మధ్య ఏకాభిప్రాయం కుదిరి, ఒక్కరే అభ్యర్థి బరిలో ఉంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. కానీ ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు విజేతను నిర్ణయించడానికి పోలింగ్‌ తప్పనిసరి. 

రహస్య పద్ధతిలో ఎందుకు? 
ఉప రాష్ట్రపతి ఎన్నికను రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించడానికి బలమైన రాజ్యాంగ పరమైన కారణాలు ఉన్నాయి. ఎంపీలు ఎలాంటి ఒత్తిడికి, ప్రలోభాలకు, పార్టీ విప్‌లకు లొంగకుండా తమ అంతరాత్మ ప్రబోధం మేరకు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఇది వీలు కలి్పస్తుంది. రాజకీయాలకు అతీతంగా సభ్యులు తమ ప్రతినిధిని ఎన్నుకోవాలన్నదే రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్‌ పత్రాన్ని పార్టీ ఏజెంట్లతో సహా ఎవరికీ చూపించడానికి వీల్లేదు.  

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)