Breaking News

ఆ 14 రోజులు ఎలా ఉంటుందనేదే అత్యంత ఆసక్తిగా ఉంది: శుభాంశు శుక్లా

Published on Thu, 06/26/2025 - 20:22

న్యూఢిల్లీ:  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా.. మిగతా 14 రోజులు తాము ఇక్కడ చేసే పరిశోధనే అత్యంత ఆసక్తిని కల్గిస్తుందని స్పష్టం చేశాడు.  ప్రస్తుతానికి కాస్త చిన్నపాటి తలనొప్పిగా ఉన్నప్పటికీ అదేమీ పెద్ద సమస్య కాదన్నాడు. తమ ముందున్న టాస్క్‌ అనేది చాలా ముఖ్యమని చెప్పుకొచ్చాడు శుభాంశు శుక్లా. ‘ ఇది చాలా గర్వించదగ్గ సమయం. మన అంతరిక్షయానంలో ఇదొక మైలురాయి. 14 రోజుల పరిశొధన మాకు అత్యంత కీలకం కానుంది’ అని తెలిపాడు ఐఎస్‌ఎస్‌ నుంచి స్పష్టం చేశాడు శుభాంశు.

కాగా, అంతరిక్ష పరిశోధనల్లో మరో కలికితురాయి. 28 గంటల సుదీర్ఘ వ్యోమనౌక ప్రయాణం తర్వాత ఐఎస్‌ఎస్‌లోకి శుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. ఫలితంగా శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.

శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్‌ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి  అడుగు పెట్టనుంది. ఇప్పటి నుంచి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఇంతకు ముందు ఐఎస్‌ఎస్‌తో స్పేస్‌ డాకింగ్‌ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ విజయవంతమైంది.  

14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు 
శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు ప్రధానంగా భారరహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అలాగే, ఇస్రో తరఫున శుభాంశు ఏడు ముఖ్యమైన ప్రయోగాలు చేస్తారు. దీంతో పాటు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లోనూ ఆయన పాల్గొంటారు. మొత్తం మీద, యాక్సియం-4 మిషన్‌లో పాల్గొన్న  వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు. ఇది ఒకే మిషన్‌లో అత్యధిక ప్రయోగాలుగా గుర్తింపు పొందుతోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)