Breaking News

MLC Kavitha: తీహార్‌ జైలులో కవితను కలిసిన సబిత, సత్యవతి రాథోడ్‌

Published on Tue, 06/18/2024 - 11:25

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు కలిశారు. వీరిద్దరూ ఢిల్లీకి వెళ్లి తీహార్‌ జైలులో ఉన్న కవితలో ములాఖత్‌ అయ్యారు.

మరోవైపు.. ఇటీవలే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తన సోదరుడు కేటీఆర్‌.. కవితను కలిసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కవితతో కేసీఆర్, కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతున్నారు. కవిత యోగ యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు. కవితను ఆమె భర్త అనిల్ వారానికి రెండుసార్లు కలుస్తున్నారు. కుటుంబ సభ్యులు కవితతో రోజూ ఐదు నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుతున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు కవిత అరెస్ట్‌ అయి మూడు నెలలు కావస్తోంది. కవిత గత 80 రోజులుగా తీహార్‌ జైలులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత, మార్చి 26న, ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు కవితను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు 14 రోజులకు ఒకసారి పొడిగించింది.

అనంతరం, తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత, సీబీఐ కేసులో కవితను జ్యుడిషియల్ కస్టడీకి కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈడీ కేసులోనూ కవితకు జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటుపై కోర్టులో వాదనలు జరిగాయి. కవిత సహా నలుగురు వ్యక్తులు దామోదర్‌, ప్రిన్స్‌ కుమార్‌, అరవింద్‌సింగ్‌, చరణ్‌ప్రీత్‌పై చార్జిషీటు దాఖలు చేశామని, వారి పాత్రపై ఆధారాలను పొందుపరిచామని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించాలని వాదించారు. కాగా.. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని, విడుదల చేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జ్యుడీషియల్‌ కస్టడీని జూన్‌ మూడో తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)