Breaking News

విషాదం: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి కన్నుమూత

Published on Fri, 02/23/2024 - 08:58

ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి (86) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మనోహర్‌ తుదిశ్వాస విడిచారు. 

వివరాల ప్రకారం.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి మృతిచెందారు. ముంబైలోని పీడీ హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఈరోజు మధ్యాహ్నం ముంబైలో మనోహర్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, గత ఏడాది మేలోనూ మెదడులో రక్తస్రావం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇక, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు గురువారం సాయంత్రమే వైద్యులు తెలిపారు. 

రాజకీయ ప్రస్థానం..
1937 డిసెంబర్‌ 2న నాంద్వీలో మనోహర్‌ జోషి జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే జరిగింది. తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన మనోహర్‌ జోషి 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968-70 మధ్య మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇక, శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్‌ జోషి 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్‌సభ స్పీకర్‌గానూ వ్యవహరించారు. మూడుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత 1990లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1990-91 మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరఫున ముంబై నార్త్‌-సెంట్రల్‌ నియోజవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. కాగా, ఆయన సతీమణి అనఘ మనోహర్‌ జోషి 2020లో మరణించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)