Breaking News

బీజేపీ ఎమ్మెల్యేలకు శుభవార్త.. యడియూరప్ప కీలక ప్రకటన!

Published on Wed, 03/08/2023 - 07:27

బెంగళూరు: రాబోయే ఎన్నికల కోసం కర్నాటకలో అధికార బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. మరోసారి అధికారం కోసం బీజేపీ మరో ప్లాన్‌ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.

కర్నాటక బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ మళ్లీ టికెట్లు దక్కుతాయని యడియూరప్ప సూచనప్రాయంగా చెప్పారు. ఎవరో నలుగురైదుగురు తప్ప, అందరికీ మరోసారి పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. గుజరాత్‌ అసెంబ్లీకి గత ఏడాది ఎన్నికల్లో అధికార బీజేపీ సుమారు 45 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపింది. ఇక్కడా అదే విధానం పునరావృతం అవుతుందేమోనని సొంతపార్టీ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు పుల్‌స్టాప్‌ పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు. 

ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు సీఎం బొమ్మై సారథ్యంలోనే జరుగుతాయన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే శాసనసభా పక్ష సమావేశంలోనే తదుపరి ముఖ్యమంత్రి ఎవరో పార్టీయే నిర్ణయిస్తుందంటూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో తాను లేననే సంకేతాలిచ్చారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)