Breaking News

15 వేల జీతంతో 30 కోట్ల ఆస్తులు?.. అవినీతికి అడ్రస్ చెప్పిన గుమస్తా!

Published on Fri, 08/01/2025 - 15:42

బెంగళూరు: ఆయనో గుమస్తా(క్లర్క్‌). ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్లను నిర్వహించడం, డాక్యుమెంట్లను తయారు చేయడం, డేటా ఎంట్రీ, కార్యాలయ పరిపాలనకు సహాయం చేయడమే పని.నెలకు జీతం అక్షరాల రూ.15,000. ప్రభుత్వ ఉద్యోగి. అనుభవం ఉంది కాబట్టి ఆస్తులు మహా అయితే ఎంతుండొచ్చు. ఓ సొంతిల్లు. ఓ పదిపదిహేను లక్షల డబ్బు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ క్లర్క్‌ ఆస్తులు రూ.30కోట్లు,బంగారం,పదుల సంఖ్యలో భవానాలు,ఎకరాలకొద్దీ పొలాలు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా?  

బెంగళూరులో శుక్రవారం లోకాయిక్తా అధికారులు ప్రభుత్వ కర్ణాటక రూరల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ (కేఆర్‌ఐడీఎల్‌) కార్యాలయంలో మాజీ క్లర్క్‌ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం, కొప్పల్ జిల్లాలోని కొప్పల్‌ పట్టణంలో ప్రభుత్వ ఆఫీస్‌లో కలకప్ప నిడగుండి క్లర్క్‌గా విధులు నిర్వహించేవారు జీతం రూ.15000. కానీ లోకాయిక్తా అధికారులు జరిపిన దాడుల్లో భయటపడ్డ కలకప్ప నిండగుండి ఆస్తుల్ని చూసి కంగుతిన్నారు.

కలకప్ప నిండగుండితో పాటు అతని ఇతర కుటుంబ సభ్యుల పేర్లమీద 24 ఇళ్లు,నాలుగు ఫ్లాట్లు, 40 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు,నాలుగు వాహనాలు 350 గ్రాముల బంగారం,1.5కేజీ వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

నిడగుండి, మాజీ కేఆర్‌ఐడీఎల్‌ ఇంజనీర్, జెడ్‌ఎం చిన్చోల్కర్, పూర్తి కాని 96 అసంపూర్ణ ప్రాజెక్టులకు నకిలీ పత్రాలను సృష్టించి రూ. 72 కోట్లకు పైగా స్వాహా చేశారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో లోకాయుక్తా అధికారులు మాజీ గుమస్తా నిడగుండి నివాసంలో తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు  దర్యాప్తు చేపట్టారు.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)