Breaking News

16 ఏళ్ల నిరీక్షణ.. నిర్దోషిగా హైకోర్టు మాజీ జడ్జి

Published on Sat, 03/29/2025 - 18:00

చంఢీగడ్:  అదొక పదహారేళ్ల క్రితం కేసు.. అందులోనూ హైప్రొహైల్ కేసు. ఒక జస్టిస్‌ తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి సుదీర్ఘకాలం వేచి చూసిన కేసు. హర్యానా జడ్జిగా పని చేసిన జస్టిస్ నిర్మలా యాదవ్.. భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే కేసు. అయితే ఆ కేసు సుదీర్ఘంగా విచారణ చేసింది సీబీఐ. చివరకు  ఆ కేసులో నిర్మలా యాదవ్ ఎటువంటి తప్పుచేయలేదని తేలడంతో ఆమెకు బిగ్ రీలీఫ్ లభించింది. 

తాజాగా సీబీఐ కోర్టు.. ఆమెను నిర్దోషిగా తేల్చి తీర్పును వెలువరించింది. 2008 జరిగిన ఈ కేసులో తీర్పు తనకు అనుకూలంగా రావడంతో జస్టిస్ నిర్మలా యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా ఈరోజు(శనివారం) సీబీఐ కోర్టుకు హాజరైన ఆమె.. తీర్పు తర్వాత మాట్లాడారు. తనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని, అందుకే ఇంతకాలం ఓపిక పట్టిన దానికి ప్రతిఫలం లభించిందన్నారు.  

ఒక జడ్జికి ఇవ్వబోయి.. మరొక జడ్జికి క్యాష్ డెలివరీ
ఆ ఇదర్దు జడ్జి పేర్లు ఇంచుమించు ఒకే మాదిరి ఉంటాయి. ఒకరు నిర్మలా యాదవ్ అయితే మరొకకే నిర్మలాజిత్ కౌర్. అయితే హర్యానా మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ సంజీవ్ బన్సాల్  క్లర్క్.. ఓ రూ. 15 లక్షల నగదును ప్యాక్ చేసుకుని నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు విచారణలో తేలింది. తాను ఇవ్వాల్సింది జస్టిస్ నిర్మలాజిత్ కౌర్ కని కాకపోతే పొరపాటున జస్టిస్ నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు  ఆ ప్యాక్ తీసుకెళ్లిన అప్పటి క్లర్క్.

 రోజుల వ్యవధిలో ఆమెపై రెండు ఎఫ్ఐఆర్‌లు
ఈ కేసుకు సంబంధించి 2008, ఆగస్టు 16వ తేదీన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఆ తర్వాత మళ్లీ ఓ కీలక మలుపు తీసుకుంది. అప్పటి యూనియన్ టెర్రిటరీ జనరల్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్ ఆదేశాలతో ఆ కేసును సీబీఐకి బదిలీ చేశారు. దాంతో  12 రోజుల వ్యవధిలో సీబీఐ మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

2009 జనవరిలో సీబీఐ విచారణ ప్రారంభం
జస్టిస్ నిర్మలా యాదవ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల్లో దర్యాప్తు చేపట్టేందుకు తమకు అనుమతి కావాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టుకు విజ‍్క్షప్తి చేసింది సీబీఐ. దీనికి అనుమతి లభించడంతో జస్టిస్ నిర్మలా యాదవ్ పై విచారణ చేపట్టింది సీబీఐ. 2011లో ఆమెపై చార్జిషీట్ నమోదు చేసింది సీబీఐ.

దీనిలో భాగంగా  మొత్తం 84 మంది సాక్షులను పేర్లను నమోదు చేసింది. ఇందులో 69 మందిని విచారించిన సీబీఐ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 10 మంది సాక్షులను తిరిగి విచారించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే 10 మంది కీలక సాక్షులను మళ్లీ విచారించారు. చివరకు ఆ రూ. 15 లక్షల కేసులో  జస్టిల్ నిర్మలా యాదవ్ పాత్ర ఏమీ లేదని తేలడంతో ఆమె నిర్దోషిగా నిరూపితమయ్యారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)