Breaking News

బిట్‌కాయిన్‌ దోపిడీ కేసు.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఐపీఎస్‌కు జీవిత ఖైదు

Published on Sat, 08/30/2025 - 08:10

అహ్మదాబాద్‌: 2018 నాటి బిట్‌కాయిన్‌ దోపిడీ, బిల్డర్‌కిడ్నాప్‌ కేసులో అహ్మదాబాద్‌ ప్రత్యేక కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నళిన్‌ కొటాడియా, మాజీ ఐపీఎస్‌ అధికారి జగదీశ్‌ పటేల్‌ సహా 14 మందికి జీవిత ఖైదు విధించింది. శైలేష్‌ భట్‌ అనే బిల్డర్‌ను అపహరించిన ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో పలువురు గుజరాత్‌ పోలీసు అధికారులు సైతం ఉండటం గమనార్హం.

వివరాలు ఇలా ఉన్నాయి.. శైలేష్‌ భట్, అతడి సన్నిహితులు కలిసి సూరత్‌కు చెందిన ధావల్‌ మవానీ అనే వ్యక్తి నుంచి రూ.150 కోట్ల విలువైన బిట్‌ కాయిన్లను దొంగతనం చేసినట్లు నళిన్‌ కొటాడియా, అతడి బ్యాచ్‌కు సమాచారం అందింది. దీంతో, వారు భట్‌ను దోచుకునేందుకు పథకం వేశారు. ఈ కుట్రలో వారు పలువురు పోలీసు ఉన్నతాధికారులను సైతం కలుపుకున్నారు. ఇందుకు పథకం రచించిన సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌ నాయర్‌ రూ.5 కోట్లు ముట్టాయి.

ఇతర పోలీసులతో కలిసి భట్‌ దగ్గరున్న అప్పట్లో రూ.12 కోట్ల విలువున్న బిట్‌కాయిన్లను దౌర్జన్యంగా లాక్కున్నారు. వీరు భట్‌ నుంచి 200 బిట్‌కాయిన్లను బలవంతంగా లాక్కోవడంతోపాటు, రూ.32 కోట్లు డిమాండ్‌ చేశారు. అనంతరం భట్‌ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐడీ క్రైం బ్రాంచి రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు చేపట్టింది. నిందితులుగా తేలడంతో అమ్రేహ్‌ ఎస్‌పీ జగదీశ్‌ పటేల్‌తోపాటు అనంత్‌ పటేల్‌ తదితర ఇతర పోలీసు అధికారులను అరెస్ట్‌ చేసింది. సాక్ష్యాలు, ఆధారాల ఆధారంగా విచారణలో 15 మంది నిందితులకుగాను ఏసీబీ స్పెషల్‌ కోర్టు 14 మందిని దోషులుగా తేల్చింది. జతిన్‌ పటేల్‌పై ఉన్న అన్ని ఆరోపణలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)