Breaking News

ఫస్ట్‌టైమర్లే విన్నర్లు! 

Published on Thu, 07/03/2025 - 06:30

బిహార్‌లో త్వరలో జరుగనున్న 18వ శాసనసభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు  అస్త్రశ్రస్తాలతో సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టి పెట్టాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. సిట్టింగ్‌లతో పోలిస్తే ఓటర్లు కొత్త అభ్యర్థులకే పట్టం కట్టడం బిహార్‌లో ఆనవాయితీగా వస్తోంది. 2010, 2015, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. గత మూడు పర్యాయాలు అసెంబ్లీలో అడుగు పెట్టినవారిలో సగానికి పైగా ఎమ్మెల్యేలు మొదటిసారి పోటీ చేసి గెలిచినవారే కావడం విశేషం. విజేతల్లో ఫస్ట్‌టైమ్‌ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండడం బిహార్‌ ప్రత్యేకత అని చెప్పొచ్చు. అభ్యర్థులను వరుసగా రెండోసారి గెలిపించడానికి ఓటర్లు ఇష్టపడడం లేదు.  

కొత్త ముఖాలు 50 శాతానికి పైగానే..  
బిహార్‌లో శాసనసభ స్థానాల సంఖ్య 243. 2010 ఎన్నికల్లో ఏకంగా 150 మంది మొదటిసారి విజయం సాధించారు. అంటే 61.7 శాతం మంది తొలిసారి అసెంబ్లీలో ప్రవేశించారు. 2015లో వీరి సంఖ్య కొంత తగ్గింది. 243 మందికి గాను 131 మంది తొలిసారి గెలిచారు. 53.9 శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినవారు ఉన్నారు. 2020 ఎన్నికల్లో 127 మంది ఫస్ట్‌టైమ్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీ వీరి వాటా 52.3 శాతం. మొత్తానికి కొత్త ముఖాల సంఖ్య 50 శాతానికిపైగానే ఉండడం గమనార్హం. రెండోసారి కంటే మూడోసారి గెలిచిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఈసారి ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందా? లేక ఓటర్లు మనసు మార్చు కుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.  

సిట్టింగ్‌లకు కష్టకాలమే 
రాష్ట్రంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరోసారి పోటీచేసి నెగ్గడం గగనకుసుమంగా మారుతోంది. గత 20 ఏళ్లుగా వారి సక్సెస్‌ రేటు క్రమంగా పడిపోతోంది. 2005లో పోటీ చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 71.4 శాతం మంది మళ్లీ గెలిచారు. 2010లో పోటీచేసినవారిలో కేవలం 55 శాతం మంది రెండోసారి ఎన్నికయ్యారు. 2015లో వీరి సంఖ్య 53.1 శాతానికి పడిపోయింది. 2020 ఎన్నికల్లో 48.6 శాతం మంది మరోసారి గెలిచారు. పాత ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్త నేతలకు ఓటర్లు పట్టం కడుతుండడం అశావహులకు వరం లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా యువత ఈ అవకాశం సది్వనియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  


 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)