Breaking News

ప్రతి రూపాయికి ప్రతిఫలం రూ.2.54..!

Published on Sat, 07/05/2025 - 05:52

న్యూఢిల్లీ: దేశ అంతరిక్ష కార్యక్రమం ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చిపెడుతోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ చెప్పారు. ఇస్రోలో పెట్టే ప్రతి రూపాయిపై రూ.2.54 మేర ఆదాయం వస్తోందని వెల్లడించారు. శుక్రవారం ఆయన ‘ఆక్స్‌ఫర్డ్‌ ఇండియా బిజినెస్‌ ఫోరం’లో ప్రసంగించారు. బడ్జెట్‌ తక్కువే అయినప్పటికీ అద్భుతమైన సామర్థ్యం కలిగిన భారత అంతరిక్ష రంగం ప్రపంచ గుర్తింపు సాధించిందని ఆయన వివరించారు.

 ‘మేం ఖర్చు చేసే ప్రతి రూపాయికి అందుతున్న ప్రతిఫలం రూ.2.54. బడ్జెట్‌లో పెద్దగా కేటాయింపులు లేకున్నా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుని, ఉపగ్రహాలను నిర్మించి విజయవంతంగా ప్రయోగించాం’అని తన హయాంలో అనుభవాన్ని ఆయన తెలిపారు. చంద్రయాన్‌–3 లూనార్‌ ల్యాండింగ్, ఆదిత్య ఎల్‌–1 మిషన్‌ వంటి ఇస్రో సాధించిన మైలురాళ్లు అంతరిక్ష అన్వేషణలో భారత్‌ సత్తాకు నిదర్శనాలని చెప్పారు. 

ప్రైవేట్‌ రంగం గణనీయ వృద్ధి 
ప్రైవేట్‌ అంతరిక్ష పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి సాధించిందని సోమ్‌నాథ్‌ చెప్పారు. ‘2014కు పూర్వం ఈ రంగంలో దేశంలో ఒకే ఒక్క స్టార్టప్‌ కంపెనీ ఉండేది. ఇప్పుడవి 250కి పెరిగాయి. ఉపగ్రహాలు, రాకెట్లను నిర్మించడంతోపాటు కక్ష్యలోకి ప్రవేశపెట్టే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ రంగంలో అనుబంధ కంపెనీలు కూడా పెరుగుతున్నాయి. 

ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్‌ తన వాటాను పెంచుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతోంది’అని సోమ్‌నాథ్‌ తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో భారతీయుడిని చంద్రుడిపైకి పంపి, అక్కడ ల్యాండ్‌ చేయించడంతోపాటు తిరిగి తీసుకువచ్చే బృహత్తర ప్రణాళిక ఇస్రో వద్ద ఉందన్నారు. ఇందులో పునర్వినియోగ రాకెట్ల నిర్మాణం, భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, అంతరిక్షంలోకి భారతీయులను పంపడం, చంద్రుడితోపాటు గురుగ్రహంపైకి అన్వేషణలను చేపట్టడం వంటివి కూడా ఉన్నాయని వివరించారు. 

ఇతర దేశాలకు సైతం సాయం 
నేపాల్, భూటాన్, ఒమన్, దక్షిణాఫ్రికాతోపాటు ఆసియాన్‌ దేశాల అంతరిక్ష అన్వేషణ సామర్థ్యాలను ప్రోత్సహించేందుకు, పెంచేందుకు భారత్‌ కృషి చేస్తోందన్నా­రు. పునరి్వనియోగ ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం, పరిశోధన–అభివృద్ధి వ్యయాన్ని పెంచడం, వ్యూహాత్మక అంతరిక్ష రంగంలో మరింత పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. అంతరిక్ష శాస్త్రం, సాంకేతికతలో భారత్‌ను అగ్ర స్థానానికి తీసుకెళ్లాలన్నదే ఇస్రో లక్ష్యమని సోమ్‌నాథ్‌ చెప్పారు.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)