Breaking News

ISRO: మన బాహుబలికి అంత బలం లేదట!

Published on Wed, 01/03/2024 - 20:26

అంతరిక్ష పరిశోధనల్లో వరుస సక్సెస్‌లతో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో(ISRO) ఎదురేలేకుండా దూసుకుపోతోంది. కొత్త ఏడాది ఆరంభం రోజే చేపట్టిన ప్రయోగమూ విజయవంతం  కావడంతో శాస్త్రవేత్తలు.. మరింత జోష్‌తో తదుపరి ప్రయోగాలకు సిద్ధం అవుతున్నారు. అయితే.. తన తదుపరి శాటిలైట్‌ లాంఛ్‌ కోసం విదేశీ రాకెట్‌ను ఇస్రో  ఆశ్రయిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

భారత్‌ తరఫున తర్వాతి తరం భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్‌-20 (GSAT-20)ని స్పేస్‌ఎక్స్‌కు చెందిన రాకెట్‌ ద్వారా ప్రయోగించబోతోంది. అయితే దీనిని స్వదేశీ రాకెట్‌తో కాకుండా.. విదేశీ రాకెట్‌తో ప్రయోగించబోతోంది.  ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ కంపెనీలో ఫాల్కన్‌-9 రాకెట్‌కు భారీ లాంఛర్‌గా పేరున్న సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలోని లాంఛింగ్‌ స్టేషన్‌ నుంచి ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఫాల్కన్‌ రాకెట్‌తో భారత శాటిలైట్‌ ప్రయోగం జరగనుంది. 

ఇస్రో ఏమందంటే..
గతంలో భారీ ఉపగ్రహాల ప్రయోగం కోసం ఇస్రో కమర్షియల్‌ విభాగం న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌.. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్స్పేస్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకునేది.  కానీ, ఇప్పుడు స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.  అయితే.. ఈ ప్రయోగంపై ఇస్రో చైర్మన్‌  ఎస్‌ సోమనాథ్‌ స్పందించారు. నిర్ణీత సమయానికి రాకెట్‌ అందుబాటులో లేనందునే స్పేస్‌ఎక్స్‌ను ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు. 

మన బాహుబలి ఉంది కదా!
జీశాట్‌-20 ఉపగ్రహం అత్యంత శక్తివంతమైంది. దీనిని తయారు చేయడానికి ప్రధాన ఉద్దేశం.. మారుమూల ప్రాంతాలకు సేవలు అందించడం. ఇది ఎంత శక్తివంతమైందంటే.. హార్మోనైజ్డ్ టారిఫ్ షెడ్యూల్ (HTS) సామర్థ్యం  48 జీపీబీఎస్‌.  అంతేకాదు.. 32 బీమ్స్‌ సామర్థ్యంతో అండమాన్‌ నికోబార్‌ దీవులు, జమ్ము కశ్మీర్‌, లక్షదీవులు.. ఇలా పాన్‌ ఇండియా కవరేజ్‌ చేయగలిగే సత్తా ఉంది. GSAT-N2గా దీనికి నామకరణం కూడా చేశారు. అయితే ఆ శాటిలైట్‌ బరువు.. 4,700 కేజీలు. 

భారత్‌లో ఇస్రో తరఫున ఇప్పటిదాకా ఉన్న లాంఛ్‌ వెహికిల్‌ మార్క్‌ 3(LVM3)నే అత్యధిక బరువు ఉన్న ఉపగ్రహాల్ని మోసుకెళ్‌తోంది. అందుకే ఇస్రో బాహుబలిగా దానికి పేరు ముద్రపడింది. కానీ, దాని సామర్థ్యం 4 వేల కిలోగ్రాముల దాకానే ఉంది. అందుకే అంతకు మించిన శాటిలైట్‌ ప్రయోగాల కోసం విదేశీ రాకెట్లపైన ఆధారపడాల్సి వస్తోంది. 

ఇస్రో ప్రయోగాలకు.. 10 వేల కేజీల రాకెట్లను సైతం మోసుకెళ్లగలిగే తర్వాతి తరం లాంచ్‌ వెహికిల్స్‌ (NGLV)రూపకల్పన అవసరం ఉందని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో బాహుబలిని మించిన రాకెట్‌ డిజైన్‌ రూపకల్పన జరిగిపోయిందట. అయితే.. అది ప్రత్యక్ష రూపంలోకి రావడానికి ఇంకా కొన్నేళ్లు పట్టొచ్చని సోమనాథ్‌ అంటున్నారు.   

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)