Breaking News

భారీ ఒప్పందం బాటలో ఈయూ, భారత్‌

Published on Wed, 01/21/2026 - 04:19

న్యూఢిల్లీ: గ్రీన్‌లాండ్‌ విషయంలో అమెరికాతో విబేధించిన యురోపియన్‌ యూనియ న్‌ దేశాలు, రష్యా చమురు విషయంలో ట్రంప్‌ ప్రభుత్వంతో పేచీలు పెట్టుకున్న భారత ప్రభుత్వం చివరకు ఒక్కటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాలే పరమావధిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్, ఐరోపా సమాఖ్య నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా వడివడిగా అడుగులువేస్తున్నామని యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లెయన్‌ మంగళవారం ప్రకటించారు.

ప్రపంచ ఆర్థిక సదస్సు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ నగరానికి విచ్చేసిన ఆమె మీడియాతో మాట్లాడారు. భారత్‌తో ట్రేడ్‌ డీల్‌ పురోగతి వివరాలను వెల్లడించారు. 200 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కోసం భారత్, ఈయూ తీవ్రంగా కృషిచేస్తున్నాయి. వృద్ధి కేంద్రాలుగా, ఈ శతాబ్దపు ఆర్థికశక్తులుగా ఉన్న దేశాలతో వాణిజ్యం చేసేందుకు యూరప్‌ ఉవ్విళ్లూరుతోంది. అందుకే నేను, యురోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఈనెల 25 నుంచి మూడ్రోజులపాటు భారత్‌లో పర్యటిస్తాం.

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొంటాం. తర్వాత ప్రధాని మోదీతో వాణిజ్య చర్చలు జరుపుతాం. సంప్రతింపులపై జనవరి 27న ఒక కీలక ప్రకటన చేయబోతున్నాం. వాణిజ్య ఒప్పందంపై ఇంకా కొంత పని పూర్తిచేయాల్సి ఉంది. ఈ ఒప్పందాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఒప్పందం( మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌)గా పిలుస్తున్నారు. 200 కోట్ల మందికి ప్రయోజనం చేకూరబోతోంది. ఇది ప్రపంచ జీడీపీలో 25 శాతానికి సమానం’’అని ఆమె అన్నారు.

#

Tags : 1

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)