Breaking News

దేశంలో  ‘పెరుగుతున్న ఇథనాల్‌ బ్లెండింగ్‌’ 

Published on Wed, 08/27/2025 - 06:42

సాక్షి, న్యూఢిల్లీ: ఇథనాల్‌తో కలిసిన పెట్రోల్‌ను ఇంధనంగా వాడటం వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. 2014–15 నుంచి 2025 జూలై వరకు రైతులకు రూ.1.25 లక్షల కోట్లు నేరుగా చెల్లించగా, దేశానికి రూ.1.44 లక్షల కోట్ల విదేశీ మారకాన్ని ఆదా చేసినట్లు ఆయన వివరించారు. అలాగే 736 లక్షల మెట్రిక్‌ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ ఉద్గారాలు తగ్గి, 244 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి చమురు అవసరం తక్కువైందని ఇటీవల పార్లమెంట్‌ వేదికగా వెల్లడించారు.  

ఇథనాల్‌ మిశ్రమం పెరుగుదల 
పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమం 2022 జూన్‌లోనే 10% లక్ష్యాన్ని చేరింది. తర్వాత ఇది 2022–23లో 12.06%, 2023–24లో 14.60%, 2024–25లో జూలై 31 నాటికి 19.05%గా నమోదైంది. కేవలం జూలై నెలలోనే 19.93% సాధించడం విశేషమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇథనాల్‌ ఉత్పత్తి కోసం ముడి సరుకుల విస్తరణ, పన్ను రాయితీలు, వడ్డీ సబ్సిడీ పథకాలు, సహకార చక్కెర కర్మాగారాలకు మల్టిఫీడ్‌ స్టాక్‌ ప్లాంట్లకు ఆర్థిక సాయం వంటి చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వివరించారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)