Breaking News

‘దర్భంగా ఎక్స్‌ప్రెస్’ ఘటన మరువకముందే మరో రైలు ప్రమాదం

Published on Thu, 11/16/2023 - 11:15

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి సహర్సా వెళ్తున్న 12554 వైశాలి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌-6 కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇటావాలోని సరాయ్ భూపత్ రైల్వే స్టేషన్ సమీపంలో క్లోన్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం పొద్దుపోయాక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

ఛత్ పూజలో పాల్గొనేందుకు బీహార్, యూపీకి చెందిన పలువురు ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో తూర్పు యూపీకి చెందిన ఇద్దరు, రాజస్థాన్‌కు చెందిన ఒకరు ఉన్నారు. గాయపడిన 11 మంది రైల్వే ప్రయాణికులను సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి ఆసుపత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది ప్రయాణికులను డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ప్రభుత్వ జాయింట్ హాస్పిటల్‌లో చేర్చారు. 

రైలులో మంటలు చెలరేగడానికి  గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన మైన్‌పురి ఔటర్ గేట్ ఆఫ్ ఫ్రెండ్స్ కాలనీ వద్ద చోటుచేసుకుంది. కాగా బుధవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 
ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి థాయ్‌ రెస్క్యూ బృందాలు

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)